అర్ధరాత్రి ఎన్టీఆర్ ఇంటి ముందు ఫ్యాన్స్ రచ్చ .. పోలీసుల లాఠీఛార్జ్, ఉద్రిక్తత
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు తన 39వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. తమ అభిమాన నటుడి బర్త్ డే కావడంతో ఆయనకు విషెస్ తెలియజేయడానికి గురువారం అర్ధరాత్రి హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లోని ఎన్టీఆర్ నివాసం వద్దకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. నడిరోడ్డు మీదే కేక్ కట్ చేసి, బాణాసంచా కాల్చడంతో పాటు ఈలల, కేకలతో ఆ ప్రాంతంలో హల్ చల్ చేశారు. జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేస్తూ.. ఆయన ఇంటి నుంచి బయటకు రావాలని పట్టుబట్టారు.
అర్ధరాత్రి కావడంతో వాహనదారులు, స్థానికులు ఈ ఫ్యాన్స్ రచ్చకు ఇబ్బంది పడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఎన్టీఆర్ నివాసం వద్దకు చేరుకుని అభిమానులకు నచ్చజెప్పి పంపించేందుకు యత్నించారు. అయినా అభిమానులు లెక్కచేయకపోవడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. దీంతో ఫ్యాన్స్ అక్కడి నుంచి పరుగులు తీశారు.
ఇకపోతే.. ఎన్టీఆర్ బర్త్ డేను పురస్కరించుకుని గురువారం ఆయన కొత్త సినిమా అప్డేట్ వచ్చింది. కొరటాల శివ దర్శకత్వంలో తారక్ కెరీర్లో 30వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి #NTR 30 అనే వర్కింగ్ టైటిల్ పెట్టి మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ భారీ ప్రాజెక్ట్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తుండగా... సాబు సిరిల్, శ్రీకర్ ప్రసాద్, రత్నవేలు లాంటి టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. ఈ మూవీలో ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్ పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. బస్తీకి చెందిన ఓ విద్యార్ధి, అదే బస్తీలో పేద విద్యార్థుల హక్కుల కోసం ప్రభుత్వంతో ఎటువంటి పోరాటం చేశాడు అన్నదే సినిమా కథ అని గత కొన్ని రోజులుగా ఫిలింనగర్ సర్కిల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout