మాస్ ను ఆకట్టుకుంటున్న చిరు స్వీట్ వార్నింగ్..!

  • IndiaGlitz, [Thursday,December 08 2016]

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న ప్ర‌తిష్టాత్మ‌క‌మైన 150వ చిత్రం ఖైదీ నెం150. డైన‌మిక్ డైరెక్ట‌ర్ వినాయ‌క్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ పై రామ్ చ‌ర‌ణ్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ఇక అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఖైదీ నెం 150 టీజ‌ర్ ను రిలీజ్ చేసారు.
ఏదైనా న‌చ్చితేనే చేస్తాను...న‌చ్చితేనే చూస్తాను. కాద‌ని బ‌ల‌వంతం చేస్తే...కోస్తా...ఎ స్వీట్ వార్నింగ్ అంటూ మెగాస్టార్ చెప్పిన డైలాగ్ మాస్ కి బాగా క‌నెక్ట్ అవుతుంది. చిరంజీవిని ఫ్యాన్స్ ఎలాగైతే చూడాలి అనుకుంటున్నారో....క‌రెక్ట్ గా అలాగే చిరు క్యారెక్ట‌ర్ ను డిజైన్ చేసినట్టు అనిపిస్తుంది. అలాగే చిరు వాకింగ్ స్టైల్ చూస్తుంటే....శంక‌ర్ దాదా ఎం.బి.బి.ఎస్ గుర్తుకువ‌స్తుంది. మొత్తానికి మాస్ ప‌ల్స్ బాగా తెలిసిన డైన‌మిక్ డైరెక్ట‌ర్ వినాయ‌క్ ఫ్యాన్స్ కోరుకున్న విధంగానే ఈ ఖైదీ నెం 150ని తెర‌కెక్కించారు అనిపిస్తుంది.
ప్ర‌పంచ వ్యాప్తంగా ధృవ రిలీజ్ అవుతున్న ధియేట‌ర్స్ లో ఖైదీ నెం 150 టీజ‌ర్ ను ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. ఇక ఖైదీ నెం 150 ఆడియోను క్రిస్మ‌స్ కానుక‌గా రిలీజ్ చేసి చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 11 లేక 12న రిలీజ్ చేయ‌డానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

More News

డిసెంబర్ 30న తెలుగు, తమిళ భాషల్లో పిజ్జా - 2

వరుస విజయాలతో దూకుడు మీదున్న తమిళ పాపులర్ హీరో విజయ్ సేతుపతి తమిళంలో నటిస్తున్న చిత్రం పురియత్ పుధీర్.

నా బెస్ట్ సెల్ఫీ ఇదే - అల్లు అర్జున్..!

బెంగుళూరు బ్లాష్టర్స్ జట్టుకు అల్లు అర్జున్ సహయాజమానిగా వ్యవహరిస్తున్నారు.

బాలయ్య సినిమాల టైటిల్స్ తో అల్లుడు సింగంలో సాంగ్..!

బాలకృష్ణ అభిమానులకు సంక్రాంతికి ముందే స్పెషల్ ధమకా.గతంలో నందమూరి తారక రామారావు గారి సినిమాల టైటిల్స్ తో

రీ-రికార్డింగ్ పూర్తి చేసుకున్న 'ఇదో ప్రేమ లోకం'

శ్రీ శ్రీనివాసా ఫిలింస్ బ్యానర్లో ఎస్.పి. నాయుడు నిర్మాతగా సెన్సేషనల్ దర్శకుడు కోడిరామకృష్ణ శిష్యుడైన టి. కరణ్రాజ్ దర్శకత్వంలో అశోక్చంద్ర(నూతనపరిచయం), రాజా సూర్యవంశీ, తేజారెడ్డి, కారుణ్య హీరోహీరోయిన్లుగా రూపుదిద్దుకున్న చిత్రం 'ఇదో ప్రేమ లోకం'.

రొమాంటిక్ కింగ్ తో బ్యూటీ క్వీన్ ప్రగ్యా..!

నవరస సమ్రాట్ నాగార్జున - దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబినేషన్లో రూపొందుతున్ననాలుగవ భక్తిరస చిత్రం ఓం నమో వేంకటేశాయ.