రష్మికకి షాక్... ముద్దు పెట్టి అభిమాని పరుగో పరుగు 

  • IndiaGlitz, [Tuesday,February 18 2020]

హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్న‌.. ఈ క‌న్న‌డ క‌స్తూరికి ఇప్పుడు టాలీవుడ్‌లో భారీ డిమాండే ఉంది. ఛ‌లో త‌ర్వాత ఈ సొగ‌స‌రి మ‌హేశ్ 'స‌రిలేరు నీకెవ్వ‌రు'లో న‌టించి విజ‌యాన్ని సొంతం చేసుకుంది. మంచి క్రేజ్ ద‌క్కించుకున్న ఈ అమ్మ‌డుకి రీసెంట్‌గా ఓ ఆక‌తాయి షాకిచ్చాడ‌ట‌. వివ‌రాల్లోకెళ్తే.. ఇటీవ‌ల ర‌ష్మిక మంద‌న్న ఇటీవ‌ల ఓ ఈవెంట్‌లో పాల్గొంది. అక్క‌డ ఉన్న అభిమానుల‌కు సెల్ఫీలు కూడా ఇచ్చింది. ఆమెతో సెల్ఫీ దిగిన ఆక‌తాయి.. సెల్ఫీ దిగుతుండగా ఆమెకు ముద్దు పెట్టేసి అక్క‌డ నుండి ప‌రుగు పెట్టాడ‌ట‌. దీంతో అక్క‌డున్న వారితో పాటు ర‌ష్మిక మంద‌న్న కూడా షాక‌య్యింది.

కొంద‌రు ఈ నార్మ‌ల్‌గా త‌న సెల్‌ఫోన్స్‌లో ఈ దృశ్యాన్ని తీస్తుండ‌గా ముద్దు స‌న్నివేశం కూడా రికార్డ‌య్యింది. ఇంకేముంది స‌ద‌రు వీడియో సోష‌ల్ మీడియాలో సెన్సేష‌న‌ల్‌గా మారింది. దీంతో ర‌ష్మిక స‌ద‌రు ఈవెంట్ ఆర్గ‌నైజర్స్‌పై కేసు న‌మోదు చేసింది. సైబ‌ర్ పోలీసులు సోష‌ల్ మీడియాలోని ముద్దుకు సంబంధించిన వీడియోల‌ను తొల‌గించారు. ర‌ష్మిక అనుకున్న‌దొక్క‌టైతే అయ్యిందొక్క‌టి అన్న త‌ర‌హాలో త‌ల‌ప‌ట్టుకోవాల్సి వ‌చ్చింది. ర‌ష్మిక నితిన్‌తో జోడిగా న‌టించి భీష్మ ఈ నెల 21న విడుద‌ల‌వ‌తుంది. ర‌ష్మిక‌ను తెలుగు చిత్ర‌సీమ‌కు ప‌రిచయం చేసిన వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలోనే ఈ చిత్రం తెర‌కెక్కింది.