ఫొటో షూట్లో తొక్కిసలాట.. వెనుదిరిగిన మహేశ్
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేశ్ బాబు, రష్మిక మందన్నా నటీనటులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావొచ్చింది. సినిమా రిలీజ్‌కు రోజులు దగ్గరపడుతుండటంతో షూటింగ్ స్పీడ్‌ను పెంచింది చిత్రబృందం. ఇవాళ హైదరాబాద్‌లోని లింగంపల్లి దగ్గర ఫొటో షూట్ జరిగింది. అయితే ఈ విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున.. తమ అభిమాన హీరోను ప్రత్యక్షంగా చూసి ఫొటోలు దిగడానికి తరలివచ్చారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. పెద్ద ఎత్తున అభిమానులు రావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. వాస్తవానికి ఓ వైపు పెద్ద ఎత్తున అభిమానులు తరలిరావడం.. మరోవైపు పోలీసుల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకపోవడంతో ఇలా తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. లింగంపల్లి ఆలిండ్ ఫ్యాక్టరీ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. చందానగర్ పోలీసులు అభిమానులను అడ్డుకున్నారు. కాగా ఈ తోపులాటలో పలువురికి గాయాలయ్యాయి. మరోవైపు.. బారీగేడ్స్ విరిగిపడటంతో అభిమానులకు గాయాలయ్యాయి.
అసలేం జరిగింది!
ఇలా తోపులాట జరగడంతో ఫొటో షూట్ మధ్యలోనే మహేశ్ అక్కడ్నుంచి వెనుదిరిగారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో ఫ్యాన్స్‌తో ఫొటో షూట్ అని ఆన్లైన్లో పెద్ద ఎత్తున పోస్టులు రావడంతో అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే అనుమతి లేకుండా ఫొటో షూట్ జరపడంతో ఏకే ఎంటర్టైన్మెంట్స్పై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా అభిమానులకు సంబంధించిన వీడియోలు, భారీగేడ్లు విరిగిపడిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. మరి ఈ ఘటనపై మహేశ్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments