ఫొటో షూట్‌లో తొక్కిసలాట.. వెనుదిరిగిన మహేశ్

  • IndiaGlitz, [Wednesday,December 25 2019]

సూపర్‌స్టార్ మహేశ్ బాబు, రష్మిక మందన్నా నటీనటులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావొచ్చింది. సినిమా రిలీజ్‌కు రోజులు దగ్గరపడుతుండటంతో షూటింగ్ స్పీడ్‌ను పెంచింది చిత్రబృందం. ఇవాళ హైదరాబాద్‌లోని లింగంపల్లి దగ్గర ఫొటో షూట్‌ జరిగింది. అయితే ఈ విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున.. తమ అభిమాన హీరోను ప్రత్యక్షంగా చూసి ఫొటోలు దిగడానికి తరలివచ్చారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. పెద్ద ఎత్తున అభిమానులు రావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. వాస్తవానికి ఓ వైపు పెద్ద ఎత్తున అభిమానులు తరలిరావడం.. మరోవైపు పోలీసుల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకపోవడంతో ఇలా తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. లింగంపల్లి ఆలిండ్ ఫ్యాక్టరీ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. చందానగర్ పోలీసులు అభిమానులను అడ్డుకున్నారు. కాగా ఈ తోపులాటలో పలువురికి గాయాలయ్యాయి. మరోవైపు.. బారీగేడ్స్‌ విరిగిపడటంతో అభిమానులకు గాయాలయ్యాయి.

అసలేం జరిగింది!

ఇలా తోపులాట జరగడంతో ఫొటో షూట్ మధ్యలోనే మహేశ్‌ అక్కడ్నుంచి వెనుదిరిగారు. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ ఆధ్వర్యంలో ఫ్యాన్స్‌తో ఫొటో షూట్ అని ఆన్‌లైన్‌లో పెద్ద ఎత్తున పోస్టులు రావడంతో అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే అనుమతి లేకుండా ఫొటో షూట్ జరపడంతో ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా అభిమానులకు సంబంధించిన వీడియోలు, భారీగేడ్లు విరిగిపడిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. మరి ఈ ఘటనపై మహేశ్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే.

More News

నిజ‌జీవిత నాయ‌కుడు.. వెండితెర క‌థానాయ‌కుడు 'రంగా'

అది 'అల వైకుంఠపురం' కాదు... విజయవాడ మహానగరం. పైగా అది రాజకీయాల రాజధాని. అక్కడంతా 'సరిలేరు నాకెవ్వరూ' అనుకునేవారే.

'హిట్‌' మూవీ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల

హీరోగా ప‌లు వైవిధ్య‌మైన చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను సాధించి త‌నకంటూ ఓ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు నేచుర‌ల్ స్టార్ నాని.

జనవరి 1న 'ఖో ఖో' విడుదల !!!

పులా సిద్దేశ్వర్ రావ్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం రథేరా, జాకట రమేష్ ఈ సినిమాకు దర్శకుడు.

డిసెంబర్‌ 27తో ముగియనున్న జీ తెలుగు 'ముద్ద మందారం' సీరియల్‌

గత అర దశాబ్ద కాలంగా తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది జీ తెలుగు ముద్ద మందారం సీరియల్‌.

ఏప్రిల్ నుంచి జనాభా లెక్కలు..  అపోహలు అక్కర్లేదు!

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. మంగళవారం నాడు  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సుమారు నాలుగు గంటలపాటు జరిగిన ఈ కేబినెట్ భేటీలో