పవన్ కల్యాణ్ లుక్ అదిరింది.. ఫ్యాన్స్ ఫిదా!
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండేళ్ల తర్వాత ముఖానికి రంగేసుకున్న సంగతి తెలిసిందే. ‘పింక్’ రీమేక్ సినిమాతో టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇస్తున్న ఆయనపై దర్శకనిర్మాతలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అంతేకాదు.. ఆయనకు కావాల్సిన సకల సౌకర్యాలు అనగా.. ఫ్లైట్ మొదలుకుని అన్ని కల్పించారు. ఇప్పటికే షూటింగ్లో పాల్గొన్న పవన్ తనకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ సగం వరకు కంప్లీట్ చేసుకున్నారట. అయితే.. అప్పుడెప్పుడో లాయర్ గెటప్‌లో.. ఆ తర్వాత డైలాగ్స్ లీకవ్వడంతో ఫ్యాన్స్ కాస్త ఆనందపడినప్పటికీ.. చిత్రబృందం మాత్రం తీవ్ర ఆగ్రహానికి.. నిరాశకు లోనైంది.
అటు రాజకీయాలు.. ఇటు సినిమాలు రెండూ కవర్ చేయాల్సి ఉండటంతో పవన్ లుక్ మాత్రం రివీల్ అయిపోయింది. సినిమా షూటింగ్ పాల్గొనడం.. అదే రోజో లేకుంటే ఆ మరుసటి రోజే పవన్ మళ్లీ కార్యకర్తలు, నేతలతో సమావేశం అవుతుండటంతో లుక్ తెలిసిపోతోంది. ఇదివరకు గుబురు గడ్డం.. ఒత్తైన జుట్టు, మీసాలతో కనిపించిన పవన్.. ఇప్పుడు మొత్తం మార్చేశారు. గడ్డం లేకుండా సరికొత్త లుక్‌లో కనిపించడంతో ఫ్యాన్స్, కార్యకర్తలు ఫిదా అయిపోయారు. వావ్.. పవన్ లుక్ అదిరింది అంటూ ఆయన్ను తమ కెమెరాలతో ఫొటోలు తీసుకుని నెట్టింట్లో పోస్ట్ చేస్తున్నారు.
కాగా.. ఇవాళ కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తల సమావేశానికి పవన్ హాజరై.. పార్టీ బలోపేతంపై నిశితంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన లుక్ రివీల్ అయ్యింది. ‘పింక్’ రీమేక్‌కు ‘లాయర్ సాబ్’ లేదా ‘వకీల్ సాబ్’ పెట్టాలని దర్శకనిర్మాతలు అనుకుంటున్నారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే వేసవి సెలవుల్లో సినిమా రిలీజ్ చేయాలని చిత్రబృందం భావిస్తోందట. కాగా ఇందులో పవన్ న్యాయవాది పాత్రలో నటిస్తుండగా.. మిగతా పాత్రధారుల వివరాలు మాత్రం తెలియరాలేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com