ఈటెల నివాసానికి అభిమానుల తాకిడి

  • IndiaGlitz, [Saturday,August 31 2019]

ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ నివాసం కిటకిటలాడింది. మేం గులాబీ జెండాకు ఓనర్లం అంటూ వ్యాఖ్యలు చేసిన ఈటెల ను కలిసేందుకు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పలు సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు తరలివచ్చారు. దీంతో మేడ్చల్ జిల్లా పూడుర్ లోని ఔటర్ రింగ్ రోడ్డు పక్కన ఉన్న ఈటెల నివాసం జనాలతో నిండిపోయింది.

ఉదయం ఏడు గంటల నుంచే అభిమానుల తాకిడి మొదలు కాగా... వారందరితో నూ కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఈటెలతో భేటీ అయ్యారు. పలు సంఘాల నేతలు ఈ సందర్భంగా ఆయనను సన్మానించారు.

మంత్రి పదవి కోల్పోతారని వార్తలు వస్తున్న నేపథ్యంలో .. మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. కెమెరాలు, ఫోన్లు లేకుండా లోపలికి రావాలని మంత్రి అనుచరులు సూచించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం మాట్లాడలేరని తెలిపారు. అందరూ సహకరించాలని కోరారు.

మధ్యాహ్నం వరకు అభిమానులతో మాట్లాడిన మంత్రి ఈటెల ... ఆ తర్వాత ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు సికింద్రాబాద్ బయలుదేరారు.

More News

జీవా, నయనతార నటించిన వీడే సరైనోడు సెప్టెంబర్ 6న విడుదల !

జీవా, నయనతార జంటగా తమిళంలో రూపొంది విజయం సాధించిన చిత్రాన్ని తెలుగులో 'వీడే సరైనోడు' పేరుతో అనువదిస్తున్నారు.

'మిస్టర్ రావణ' ప్రారంభం

మిస్టర్ ఇండియా టైటిల్ విన్నర్  బాలీవుడ్ స్టార్ నటుడు అనూప్ సింగ్ ఠాగూర్ టైటిల్ పాత్రలో  "మిస్టర్ రావణ"

బిగ్ బాస్ లో ఈ వారం ఎలిమినేషన్ ఉండదా?

బిగ్ బాస్ హౌజ్ లో ఎప్పటిలాగే తన ఫన్ తో నవ్వులు పూయించారు బాబా మాష్టారు.

అభిమానులు, స్నేహితులు.. ఆందోళన వద్దు: రానా

రానా దగ్గుబాటి... తెలుగులోనే కాదు బాలీవుడ్ లోనూ సినిమాలు చేసి విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

చిరంజీవికి పెను ప్ర‌మాదం త‌ప్పిందా?

మెగాస్టార్ చిరంజీవికి పెను ప్ర‌మాదం త‌ప్పింద‌ని మీడియా వ‌ర్గాల స‌మాచారం. వివ‌రాల్లోకెళ్తే.. చిరంజీవి వ్య‌క్తిగ‌త ప‌నిపై ముంబై వెళ్లారు.