కూలిన కటౌట్.. ఫ్యాన్స్‌పై కంప్లైంట్


Send us your feedback to audioarticles@vaarta.com


తమిళ హీరో విజయ్ సర్కార్ విడుదల సందర్భంగా 50 అడుగుల కటౌట్‌ను ఏర్పాటు చేశారు. అభిమానులు. ఇదొక రికార్డ్ అని అందరూ అనుకున్నారు. అయితే వీరి ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. అత్తింగల్‌లో ఉన్న మామమ్‌లోని గంగ థియేటర్ కాంప్లెక్స్ దగ్గర ఏర్పాటు చేసిన కటౌట్ కూలిపోయింది. నాలుగు బైకులు ధ్వంసమయ్యాయి.
అదృష్టవశాతూ ఎవరికీ ఏమీ కాలేదు. థియేటర్ అద్దాలు కూడా పగిలాయి. దీంతో థియేటర్ యజమాని ఫ్యాన్స్ సంఘంపై పోలీసుల కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఇరు వర్గాల వారు కోర్టు బయటే సమస్యను తీర్చుకోవడానికి రెడీ అయ్యారని అందువల్ల ఎలాంటి కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
