అభిమానుల్లో మొదలైన అసహనం.. ఇప్పుడు వెంకటేష్, తర్వాత ఎవరో!

  • IndiaGlitz, [Thursday,July 01 2021]

కరోనా మహమ్మారి ప్రపంచాన్నే కుదిపేసింది. ప్రజల జీవితాలపై పెను ప్రభావం చూపింది. అన్ని రంగాలు కరోనా ఎఫెక్ట్ తో విలవిలలాడాయి. కరోనా ఎఫెక్ట్ చిత్ర పరిశ్రమపై బాగా పడింది అని చెప్పడంలో సందేహం లేదు. లాక్ డౌన్ ఎత్తివేస్తున్నా థియేటర్స్ లో సినిమాలు రిలీజ్ చేయాలంటే నిర్మాతలు సాహసమే అని భావిస్తున్నారు.

దీనితో సినిమాల రిలీజ్ కు ఓటిటీనే ఆధారంగా మారింది. సినిమాని థియేటర్ లో చూస్తే వచ్చే కిక్కు ఓటిటిలో దొరకదు. ఈ సంగతి నిర్మాతలకు కూడా తెలుసు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కొందరు నిర్మాతలు ఓటిటీల వైపు చూడక తప్పని పరిస్థితి నెలకొంది.

ఇదీ చదవండి: రోజుకి ఎన్ని సిగరెట్స్ తాగుతావ్ ? రష్మికకు నెటిజన్ ప్రశ్న!

విక్టరీ వెంకటేష్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ వెంకీకి తిరుగులేని క్రేజ్ ఉంది. మాస్ ఆడియన్స్ లో కూడా వెంకీ మామకు పట్టు ఉంది. వెంకీ సోదరుడు, నిర్మాత సురేష్ బాబు నిర్ణయం అభిమానుల అసహనానికి కారణంగా మారింది.

ప్రస్తుతం వెంకటేష్ నటించిన అసురన్ రీమేక్ నారప్ప, మలయాళీ రీమేక్ దృశ్యం 2 రెండు చిత్రాలు రిలీజ్ కు రెడీ అయిపోయాయి. కానీ ఎపిలో ఇంకా కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది.ఇలాంటి టైం లో సినిమాని థియేటర్లలో రిలీజ్ చేసే పరిస్థితి లేదు. దీనితో సురేష్ బాబు రెండు చిత్రాలని ఓటిటి సంస్థలకు డైరెక్ట్ రిలీజ్ కోసం అమ్మేశారు.

ఈ నిర్ణయం కాస్త వెంకటేష్ అభిమానుల్లో అసహనం తెప్పించింది. తమ అభిమాన హీరోని థియేటర్ లో చూడాలనుకుంటే రెండు సినిమాలని ఓటిటి కి అమ్మేశారు అంటూ వెంకీ ఫాన్స్ సురేష్ బాబుపై ట్రోలింగ్ మొదలుపెట్టారు. వెంటనే సురేష్ బాబు తన నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. థియేటర్స్ ఓపెన్ అయ్యేవరకు ఎదురుచూడాలని కోరుతున్నారు.

థియేటర్ల పరిస్థితి ఇలాగే కొనసాగితే మిగిలిన స్టార్ హీరోల చిత్రాలకు కూడా ఓటిటి రిలీజ్ తప్పదేమో. ఇదే కనుక జరిగితే అందరి హీరోల అభిమానుల్లో అసహనం ఖాయం.