ఉత్తరాంధ్రకు తప్పిన 'ఫొనీ' ముప్పు

  • IndiaGlitz, [Friday,May 03 2019]

ఉత్తరాంధ్రకు పెను తుఫాన్ 'ఫొనీ' ముప్పు తప్పింది. ఒడిశా రాష్ట్రంలో ‘ఫొనీ’ తుఫాన్ ప్రవేశించింది. దీని ప్రభావంతో పూరీలో కుండపోత వర్షం కురుస్తోంది. 'ఫొనీ' తుఫాన్ ప్రభావంతో 180-190 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఒడిశా, పశ్చిమబెంగాల్‌లో 24గంటల పాటు తుఫాన్ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే తుఫాను బాలాసోర్ సమీపంలో మరోసారి సముద్రంలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని అధికరులు అంచనా వేస్తున్నారు. బంగ్లాదేశ్ వెళ్లేలోపు తుఫాను బలహీనపడుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఒడిశాలో పెనుతుఫాను అల్లకల్లోలం సృష్టిస్తోంది. పూరీ, ఒడిశా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

కాగా.. ఇవాళ మధ్యాహ్నం పూరీకి సమీపంలో పెనుతుఫాన్‌గానే ‘ఫొనీ’ తీరం దాటనుంది. ఉత్తర ఈశాన్య దిశగా పయనిస్తూ క్రమేణా బలహీనపడి అతి తీవ్ర తుఫాన్‌గా పశ్చిమబెంగాల్ వైపు పయనించనుంది. కాగా.. తీరం దాటే సమయంలో 170-200 కిలోమీటర్ల వరకు పెనుగాలులు వీస్తాయని అధికారులు చెబుతున్నారు. రానున్న 24 గంటల్లో శ్రీకాకుళం జిల్లాకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయి. మరోవైపు పోర్ట్ ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. తుఫాను సమస్యలపై 1100కు కాల్ చేయండని ఆర్టీజీఎస్ స్పష్టం చేసింది.

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె. నివాస్ మాట్లాడుతూ.. ‘ఫొనీ’ తుఫాను జిల్లాను దాటింది. కంచిలి మండలంలో 19 సె.మీల వర్షం పడింది. ఇచ్ఛాపురం మండలంలో 140 కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు వీచాయి. సముద్ర తీరానికి దగ్గర్లో ఉన్న గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాం. ఇచ్ఛాపురంలో మూడు ఇళ్లు మినహా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. విద్యుత్ స్తంభాలు కొన్ని దెబ్బతిన్నట్లు సమాచారం అందింది. వాటిని తక్షణమే పునరుద్దరణ చేస్తాం. రహదారిపై రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండే చేస్తాం. తుఫాను అనంతరం వరదలు వచ్చే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. బహుదా, వంశధార నదులకు వరదలు వచ్చే అవకాశం ఉంది. ఇసుక తవ్వకాలతో పాటు ఇతర పనులకు ప్రజలు నదుల్లోకి వెళ్లరాదు. నదీతీరంలోని ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినకుండా చర్యలు తీసుకున్నాం అని జె. నివాస్ మీడియాకు వివరించారు.

గత 24గంటల్లో ఒడిశాలో పరిస్థితి ఇదీ..

గత 24గంటల్లో ఒడిశాలో 16.07 కిలోమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. రాయ్‌ఘడ్‌లో 9.5 మి.మీ, కోల్నార 5.2 మి.మీ, కె.సింగపూర్ 1.8 మి.మీ, గుణ్‌పూర్ 24 మి.మీ, పద్మాపూర్ 18.7 మి.మీ, గుడారి 28.6 మి.మీ, రామన్‌గూడ 14.4 మి.మీ, కటక్ 3.2 మి.మీ, మునిగుడ 47 మి.మీ, చంద్రపూర్‌లో 22 మి.మీల వర్షపాతం నమోదైంది.

విశాఖ విషయానికొస్తే..

‘ఫొనీ’ తుఫాను కారణంగా జిల్లాలో పలు రైళ్లు రద్దు చేస్తున్న రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్-భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ విశాఖలోనే నిలిచిపోయింది. దీంతో రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు ఒడిశాలో రైలు, విమాన సర్వీసులు సైతం నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా కోల్‌కతా-చెన్నై మార్గంలో 220కిపైగా రైళ్లు రేపటి వరకు రద్దు చేయడం జరిగింది. భవనేశ్వర్‌, కోల్‌కతా విమానాశ్రయాలకు విమానాల రాకపోకలు నిషేధించారు. తగు జాగ్రత్తలు తీసుకోవాలని తీరప్రాంత ప్రజలకు విమానాశ్రయాలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు మూడు ప్రత్యేక రైళ్లను కేటాయిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. మరో మూడ్రోజుల పాటు రైల్వే సిబ్బందెవ్వరూ సెలవులు పెట్టొద్దని రైల్వేశాఖ సూచించింది.

More News

‘సైరా’ సెట్‌లో భారీ అగ్నిప్రమాదం.. తప్పిన పెనుముప్పు

‘సైరా’ సెట్‌లో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పీఎస్ పరిధి కోకాపేటలోని మెగాస్టార్ చిరంజీవి ఫామ్ హౌస్‌లో ‘సైరా’

గడగడలాడిస్తున్న ‘ఫొనీ’.. ఉదయం నుంచీ సెక్రటేరియట్‌లోనే చంద్రబాబు 

బంగాళాగాతంలో అతితీవ్ర తుపానుగా మారిన 'ఫొనీ' ప్రభావంపై.. గురువారం ఉదయం నుంచి సచివాలయంలోనే చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు. 'ఫణి' తుపాన్ పరిస్థితి పై ఎప్పటికప్పుడు బాబు ఆరా తీస్తున్నారు.

ఎట్టెట్టా... నోటా!

'నోటా' అనే పేరు వినగానే గ‌తేడాది విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన బై లింగ్వుల్ చిత్రం అని అంద‌రికీ ఇట్టే అర్థ‌మ‌వుతుంది. ఈ సినిమాను సూర్య క‌జిన్ జ్ఞాన‌వేల్ రాజా నిర్మించారు.

18న చ‌లో విజ‌య‌వాడ‌

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీ ఈ నెల 18న 'చ‌లో విజ‌య‌వాడ‌' అని అన‌నుంది. ఇంత‌కీ తెలుగు ఇండ‌స్ట్రీ ఆ రోజు ఎందుకు వెళ్ల‌నుంది అనేగా అనుమానం. 'మ‌హ‌ర్షి' స‌క్సెస్‌మీట్ కోసం.

నిఖిల్ ఆ ప‌నుల్లో ఉన్నాడు 

'కార్తికేయ‌' చిత్రం గుర్తుంది క‌దా?  ద‌ర్శ‌కుడు చందు మొండేటికి మంచి పేరు తెచ్చిపెట్టింది. థ్రిల్ల‌ర్‌గా చాలా మందిని ఆక‌ట్టుకుంది. సుబ్ర‌హ్మ‌ణ్య‌పురంలో జ‌రిగిన క‌థ‌తో ఈ సినిమా రూపొందింది.