ఉత్తరకోస్తా వైపు దూసుకొస్తున్న ‘ఫోనీ’ తుపాన్
Send us your feedback to audioarticles@vaarta.com
ఉత్తర కోస్తా వైపు 'ఫోనీ' తుపాను దూసుకొస్తోంది. మే 02 నుంచి ఉత్తరాంధ్రపై ప్రభావం ఉంటుందని వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. ప్రస్తుతం చెన్నైకి ఆగ్నేయంగా 870 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నది.
మచిలీపట్నంకు దక్షిణ ఆగ్నేయంగా 1050 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. కాగా.. రాత్రికి ‘ఫోనీ’ తీవ్ర తుపానుగా మారే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రేపు లేదా ఎల్లుండికి అతా తీవ్ర తుపానుగా 'ఫోనీ' మారనుంది.
ఇదిలా ఉంటే.. ఈ నెల 30 నుంచి దక్షిణ కోస్తాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు న్నాయి. మే-01న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో వర్షాలు విస్తారంగా పడనున్నాయి.
మే-03 నుంచి ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతీ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. కోస్తా తీరం వెంబడి 45-50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవాకాశముంది. ఇప్పటికే అన్ని ప్రధాన పోర్టుల్లో 2 వ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments