క్రేజ్‌తో ఫ్యాన్స్ రేట్ దక్కించుకున్న 'రంగ్ దే'
Send us your feedback to audioarticles@vaarta.com
నితిన్, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం ‘రంగ్ దే’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 26న విడుదలవుతుంది. నితిన్, కీర్తి జంటతో పాటు వెంకీ తెరకెక్కించిన ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని సినిమా టీజర్ చూసిన వారికి ఓ క్లారిటీ వచ్చింది. టీజర్, సాంగ్స్‌తో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే అయ్యింది. ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోన్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కులన్నీ కలిపి రు.36 కోట్ల మేరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. సినిమా విడుదలకు ముందుగానే నిర్మాతలకు రు.6 కోట్ల లాభాలు వచ్చాయి.
ఇక ఓవర్‌సీస్ బిజినెస్ విషయానికి వస్తే రు.1.5కోట్లకు ఓవర్‌సీస్ హక్కులు అమ్ముడయ్యాయట. సినిమాకు హాఫ్ మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ వస్తే చాలు బ్రేక్ ఈవెన్ అయినట్లేనని ట్రేడ్ వర్గాల టాక్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్నినిర్మించారు. ‘చెక్’ తర్వాత నితిన్ హీరోగా నటించి విడుదలవుతున్న చిత్రమిది. మరో వైపు నితిన్.. బాలీవుడ్ చిత్రం అంధాదున్ రీమేక్‌లో బిజీగా ఉన్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com