‘ఎఫ్ 3’.. ఫ్యాన్సీ డీల్ పూర్తి
Send us your feedback to audioarticles@vaarta.com
స్టార్స్ నటించే సినిమాలకు ఉండే క్రేజే వేరు. సినిమా సెట్స్‌పై ఉండగానే బిజినెస్ పూర్తవుతుంది. ఇప్పుడు ఎఫ్ 3 విషయంలో అదే జరిగింది. విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మిల్కీబ్యూటీ తమన్నా, మెహ్రీన్ హీరో హీరోయిన్లుగా బ్లాక్‌బస్టర్ టాక్‌తో 2019 సంక్రాంతి విన్నర్‌గా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రం ‘ఎఫ్ 2’. ..వరుస విజయాలతో దూసుకెళ్తోన్న బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనీల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా భారీ వసూళ్లను సాధించిన ‘ఎఫ్2 ’చిత్రానికి ఫ్రాంచైజీగా ‘ఎఫ్ 3’ రూపొందుతోంది.
ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. సినిమా సెట్స్‌పై ఉండగానే ప్రముఖ సంస్థ జీ స్టూడియోస్ ..‘ఎఫ్ 3’ డిజిటల్, శాటిలైట్ హక్కులను ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. డిజిటల్ హక్కులు రూ.12 కోట్లు, శాటిలైట్ హక్కులు రూ.12 కోట్లు రూపాయలకు అమ్ముడయ్యాయని సమాచారం. హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఫన్ రైడర్‌ను ఆగస్ట్ 27న విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు అధికారికంగా తెలియజేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments