700 కి.మీ నడిచిన సోనూసూద్ అభిమాని.. చలించిపోయిన రియల్ హీరో
Send us your feedback to audioarticles@vaarta.com
నటుడు సోనూసూద్ ప్రస్తుతం నేషనల్ రియల్ హీరో. అభినవ కర్ణుడిగా కరోనా కష్టకాలంలో పేదవారిని ఆదుకుంటున్నాడు సోనూసూద్. గత ఏడాది లాక్ డౌన్ నుంచి సోనూ సూద్ దాతృత్వం కొనసాగుతోంది. లాక్ డౌన్ తో తమ సొంత గ్రామాలకు వెళ్లేందుకు రవాణా సౌకర్యం లేని వలస కార్మికుల్ని సొంత ఖర్చులతో విమానం ద్వారా తరలించాడు.
ఇదీ చదవండి: ఓటిటి దిశగా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' ?
నిరుపేదలకు ఆసుపత్రి ఖర్చులు భరించాడు. కరోనా సెకండ్ వేవ్ లో స్వయంగా ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేశాడు. ఇలా ఒకటా రెండా లెక్క లేనన్ని సహాయాలు చేస్తూ రియల్ హీరోగా మారిపోయాడు. దీనితో సోనూసూద్ తన అభిమానులకు ఆరాధ్య దైవంలా మారిపోయాడు అంటే అతిశయోక్తి కాదు.
తనపై ప్రజలు ఎంత అభిమానం చూపుతున్నారో అనడానికి తాజాగా ఓ సంఘటన జరిగింది. వెంకటేష్ అనే యువకుడు సోనూ సూద్ ని కలుసుకునేందుకు వికారాబాద్ నుంచి ముంబైకి 700 కిమీ కాలినడకన వెళ్ళాడు. ఆశ్చర్యం కలిగించే సంఘటన ఇది. సోనూ సూద్ ని గుండెల నిండా నింపుకున్న వెంకటేష్ కనీసం చెప్పులు కూడా లేకుండా ఈ పాదయాత్ర చేశాడు. చివరకు గమ్యం చేరుకొని సోనూసూద్ ని కలిశాడు.
'ది రియల్ హీరో సోనూసూద్.. నా గమ్యం.. నా గెలుపు' అని రాసి ఉన్న ప్లకార్డుని వెంకటేష్ తీసుకువెళ్లాడు. 700 కిమీ కాలినడకన వచ్చిన తన అభిమానిని చూసి సోనూసూద్ చలించిపోయాడు. అతడిని చూస్తే నాకు గర్వంగా ఉంది. కానీ ఇలాంటివి ప్రోత్సహించదగినవి కాదు. దయచేసి ఎవ్వరూ నా కోసం ఇలా చేయవద్దు అని సోనూసూద్ అన్నారు.
వెంకటేష్ తిరిగి వికారాబాద్ చేరుకోవడానికి సోనూసూద్ స్వయంగా రవాణా సౌకర్యం ఏర్పాటు చేశాడు. తాను చేస్తున్న సహాయసహకారాలకు తన ఫ్యామిలీ మద్దతు ఎంతైనా ఉంది అని సోనూసూద్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. తన భార్య తల్లిదండ్రులు హైదరాబాద్ కు చెందినవారని, ఆమె ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ గోదావరి జిల్లాలతో ముడిపడి ఉందని సోనూసూద్ రివీల్ చేశాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout