ఆ యాడ్స్ చేయకండి అంటూ హీరోకి అభిమాని వేడుకోలు
- IndiaGlitz, [Monday,May 06 2019]
పొగాకుకి సంబంధించిన ఉత్పత్తులకు సంబంధించిన ప్రకటనల్లో నటించవద్దు అంటూ బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్‌కు నానక్ రామ్ అనే అభిమాని విన్నవించుకున్నాడు. ఇంతకు ఆ అభిమాని అజయ్ దేవగణ్‌ని ఎందుకు రిక్వెస్ట్ చేశాడ తెలుసా?.. పొగాకుకి సంబంధించిన ఓ ప్రొడక్ట్‌కి అజయ్ దేవగణ్ బ్రాండ్ అంబాసిడర్‌లా వ్యవహరించాడు. హీరోని చూసి నానక్‌రామ్ కూడా ఆ పొగాకునే నమలడం ప్రారభించాడు.దాని వల్ల ఇప్పుడు నానక్‌రామ్‌కి క్యానర్స్ వచ్చింది.
మందు, పొగాకు ఉత్పత్తులు వాడకం శరీరానికి ఎంతో అనర్థమని గ్రహించిన నానక్ రామ్, ఆ పొగాకుకి సంబంధించిన ప్రకటనల్లో నటించొద్దు అంటూ అజయ్ దేవగణ్‌కు విన్నవించుకుంటూ ఓ వెయ్యి కరపత్రాలు ముద్రించి పరిసర గ్రామాల్లో అంటించారు.
నానక్‌రామ్‌కి ఇద్దరు పిల్లలు.. టీ స్టాల్ నడుపుకునే తనకి క్యాన్సర్ రావడం ఎంతో బాధాకరం. అయితే తనలా అందరూ బాధపడకూడదని నానక్ రామ్ చేస్తున్న కృషి అభినందనీయమే. మరి అభిమాని వేడుకోలుని అజయ్‌దేవగణ్ అర్థం చేసుకుని పొగాకు ఉత్పత్తుల కమర్షియల్ యాడ్స్‌కు దూరంగా ఉంటాడేమో చూడాలి.