ఏపీలో 'ఫ్యాన్' గాలి.. తెలంగాణలో తగ్గిన 'కారు' జోరు!
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు రాష్ట్రాల్లో త్వరలో జరగనున్న ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించిన జాతీయ మీడియా సంస్థలు సర్వేలు చేస్తున్నాయి. ఇప్పటికే ఒకట్రెండు సంస్థలు సర్వే ఫలితాలు వెల్లడించగా తాజాగా టైమ్స్ నౌ– వీఎంఆర్ సంస్థ సర్వే వెల్లడించింది. ఈ సర్వేలో ఏపీలో ‘ఫ్యాన్’ గాలి వీయగా.. అధికార పార్టీ అయిన ‘సైకిల్’ పరిస్థితి ఘోరంగా ఉందని తేల్చింది. మరోవైపు తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో ‘కారు’ జోరు తగ్గుతుందని అనుకున్నన్ని సీట్లు రావని తేలింది.
ఏపీలో ‘ఫ్యాన్’ గాలి!
మొత్తం లోక్‌సభ స్థానాలు: 25
వైసీపీ : 23 సీట్లు
టీడీపీ : 02 సీట్లు మాత్రమే పరిమితమవుతుందని తేల్చింది. అయితే జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు ఖాతా తెరవలేవని స్పష్టం చేసింది. కాగా జాతీయ సర్వేలో ఈ సారి కూడా జనసేన ఊసే లేకపోవడం గమనార్హం.
ఓట్ల శాతం పరంగా చూస్తే..
వైసీపీ: 49.5 శాతం ఓట్లు
టీడీపీ: 36 శాతం
బీజేపీ (ఎన్డీఏ): 4.8 శాతం
కాంగ్రెస్ (యూపీఏ): 2.5 శాతం ఓట్లు పడతాయని వెల్లడించింది. కాగా.. వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రజా సంకల్ప యాత్ర ప్లస్ అవుతుందని జాతీయస్థాయి విశ్లేషకులు చెబుతున్నారు.
‘కారు’ జోరు తగ్గింది..!
తెలంగాణలో ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే.. 17 లోక్‌సభ సీట్లుండగా.. టీఆర్ఎస్కు కేవలం 10 సీట్లు.. కాంగ్రెస్‌కు 5సీట్లు, బీజేపీ ఇతరులకు ఒక్కో సీటు చొప్పున రావచ్చని అంచనా వేసింది. కాగా ఎన్నికలు జరిగితే 16 తమ పార్టీ గెలుస్తుందని.. మిగిలిన ఆ ఒక్క సీటు ఎంఐఎంకు మాత్రమే దక్కుతుందని టీఆర్ఎస్ నేతలు బల్లగుద్ది చెబుతున్న సంగతి తెలిసిందే.
మొదటి సర్వేలో ఏం తేలింది..!
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. మొత్తం 25 లోక్‌సభ స్థానాలకు గాను వైసీపీకి 19 సీట్లు, టీడీపీకి కేవలం 6 సీట్లు మాత్రమే వస్తాయని రిపబ్లిక్ టీవీ-సీ ఓటర్ సంస్థలు తేల్చిన సంగతి తెలిసిందే. ఓట్ల శాతం పరంగా చూసినా వైసీపీకి 41.3 శాతం ఓట్లు.. టీడీపీకి 33.1 శాతం ఓట్లు పడతాయని సర్వేలో తేలింది.
మొత్తానికి చూస్తే.. అక్కడ ‘ఫ్యాన్’.. ఇక్కడ ‘కారు’ మంచి జోరుమీదనే ఉన్నాయి. అయితే ఈ సర్వేలు ఏ మేరకు నిజమవుతాయి..? ఇప్పటి వరకూ తెలుగు రాష్ట్రాలపై జాతీయ మీడియా చేసిన సర్వేలన్నీ అక్షరాలా నిజమవుతాయా..? లేకుంటే అట్టర్ ప్లాప్ అవుతాయా..? అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout