సంజ‌య్ ద‌త్‌ను షాక్‌కు గురి చేసిన అభిమాని...

  • IndiaGlitz, [Wednesday,March 07 2018]

బాలీవుడ్ స్టార్ సంజ‌య్ ద‌త్‌ను ఓ అభిమాని చ‌ర్య షాక్‌కి గురి చేసింది. చివ‌ర‌కు ఆ అభిమాని చ‌నిపోయి ఉండ‌టం గ‌మ‌నార్హం. వివ‌రాల్లోకెళ్తే.. ముంబైకి చెందిన నిషా త్రిపాఠి అనే మ‌హిళ త‌న ఆస్థినంత‌టినీ సంజ‌య్ ద‌త్ పేరిట రాసి చ‌నిపోయింది. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాకు అధికారులు ఈ విష‌యాన్నితెలియ‌జేసేంత వ‌ర‌కు సంజ‌య్ ద‌త్‌కు కానీ.. ఆమె కుటుంబ స‌భ్యుల‌కు కానీ ఈ విష‌యం తెలియ‌ద‌ట‌.

అయితే సంజ‌య్ ద‌త్ త‌న‌కు న్యాయ ప‌ర‌మైన స‌మ‌స్య‌లు రాకుండా ... త‌న‌కు, బ్యాంకులోని నిషా త్రిపాఠి మొత్తానికి సంబంధం లేద‌ని సంజ‌య్ ద‌త్ బ్యాంకు అధికారుల‌కు లేఖ రాశాడ‌ట‌. "అస‌లు నిషి ఎవ‌రో నాకు తెలియ‌దు. ఆమె ఆస్థి అంతా ఆమె కుటుంబీకుల‌కే చెందాలి. వారికి న్యాయ ప‌రంగా నా వంతు స‌హ‌కారాన్ని అందిస్తాను" అంటూ దీనిపై సంజ‌య్ వ్యాఖ్యానించారు.