తారక్ ట్రాఫిక్ చలానా కట్టిన ఫ్యాన్..!
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్ వీరాభిమాని ఒకరు... ఆయనకు చిన్నపాటి షాకింగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇంతకీ తారక్‌కు సదరు అభిమాని ఇచ్చిన షాకింగ్ గిఫ్ట్ ఏంటో తెలుసా..!. గతంలో ఔటర్ రింగ్ రోడ్డులో ఓవర్‌స్పీడుగా కారు నడిపినందుకుగానూ.. ట్రాఫిక్ పోలీసులు రూ.1035 జరిమానా విధించారు. ఈ విషయం తెలుసుకున్న ఓ అభిమాని ఆన్‌లైన్‌లో ఎన్టీఆర్ జరిమానాను చెల్లించాడు. దీనిపై ఆన్‌లైన్‌లో స్పందిస్తూ.. ‘తారక్ అన్నా.. నాకు, నా స్నేహితులకు భ్రమరాంబ, మల్లిఖార్జున థియేటర్లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చూడటానికి టిక్కెట్స్ ఇప్పించండి’’ అన్నారు. ఎన్టీఆర్‌కు ఫ్యాన్ జరిమానా చెల్లించి దానికి సంబంధించిన ఆన్‌లైన్ బ్యాంకింగ్‌ను షేర్ చేసి.. ట్రిపులార్ టిక్కెట్స్ అడిగిన ట్వీట్ తెగ వైరల్ అయ్యింది.
దర్శకధీరుడు ఎంతో ప్రెస్టీజియస్‌గా రూపొందిస్తోన్న పిక్షనల్ పీరియాడికల్ డ్రామా ‘ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)’. ప్రీ ఇండిపెండెన్స్ ముందు అంటే 1920 బ్యాక్‌డ్రాప్‌లో సినిమా సాగుతుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇందులో తెలంగాణ పోరాట యోధుడు కొమురం భీమ్ పాత్రలో నటిస్తుంటే, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. ఇద్దరు స్వాతంత్య్ర సమరయోధులకు సంబంధించిన కల్పిత కథాంశంతో రూపొందుతోన్న చిత్రం. ఇంకా బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్, అలిసన్ డూడి, రే స్టీవెన్ సన్, ఒలివియా మోరిస్, సముద్రఖని తదితరులు నటిస్తున్నారు. రూ.450 కోట్ల రూపాయల భారీ బడ్టెట్‌తో, భారీ ప్యాన్ ఇండియా తారాగణంతో రూపొందుతోన్న ఈ ఫిక్షనల్ పీరియాడికల్ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా 2021 దసరాకు విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com