ప్రముఖ టీవీ నటి ఆత్మహత్య

  • IndiaGlitz, [Saturday,January 25 2020]

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ టీవీ నటి సెజల్ శర్మ ఆత్మహత్య చేసుకుంది. ‘దిల్ తో హ్యాపీ హై జీ’ టీవీ సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న సెజల్ శుక్రవారం నాడు తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ముంబై నగరంలోని థానే జిల్లాలో చోటుచేసుకుంది. శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కాగా.. ఈమె ఆత్మహత్యచేసుకున్న సమయంలో ఇద్దరు మిత్రులు ఆమె ఇంట్లోనే ఉన్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఆత్మహత్యకు ముందు ఆమె రాసిన సూసైడ్ నోట్ లభ్యమైంది. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అసలేం జరిగింది!?

కాగా.. ఈ ఘటనపై ఆమె మిత్రుడు, సహనటుడు నిర్భయ్ శుక్లా మాట్లాడుతూ అసలేం జరిగిందన్న విషయాలను నిశితంగా మీడియాకు వివరించాడు. సెజల్ తండ్రికి ఆరోగ్యం సర్లేదని.. దీంతో ఆమె మానసిక ఒత్తిడి గురైందని చెప్పుకొచ్చాడు. తండ్రికి ఇదివరకే కాన్సర్ వచ్చింది. అయితే ఈ క్రమంలో గుండె నొప్పి రావడం.. ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించిందని తెలిపాడు. త్వరలోనే మేమిద్దరం కలుద్దామని మెసేజ్ కూడా చేసుకున్నామని శుక్లా వివరించాడు. ఇంతలోనే ఇలాంటి విషాద ఘటన వినాల్సి వస్తుందని తాము అనుకోలేదని శుక్లా ఆవేదన వ్యక్తం చేశారు.