తల్లి కాబోతున్న ప్రముఖ గాయని..
- IndiaGlitz, [Thursday,March 04 2021]
ప్రముఖ గాయని తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని ఆమె ట్విటర్ వేదికగా స్వయంగా వెల్లడించింది. సింగర్ శ్రేయా ఘోషల్ తాను పెళ్లికాబోతున్నానంటూ శుభవార్త చెప్పింది. 'బేబీ శ్రేయాదిత్య కమింగ్' అంటూ సోషల్ మీడియా ద్వారా శ్రేయ తను తల్లి కాబోతోన్న విషయాన్ని అభిమానులతో పంచుకుంది. తమ జీవితంలోకి బేబి శ్రేయాదిత్య రాబోతోందంటూ శ్రేయా తెలిపింది. అందరి దీవెనలూ కోరుతూ బేబి బంప్‌తో ఉన్న ఫోటోను షేర్ చేసింది.
‘‘బేబి శ్రేయాదిత్య రాబోతోంది. శైలాదిత్య, నేను ఈ వార్తను మీతో పంచుకుంటున్నందుకు చాలా సంతోషస్తున్నాం. మా జీవితంలో కొత్త అధ్యాయంలోకి అడుగుపెడుతున్న ఈ శుభ సందర్భంలో మీ అందరి ప్రేమ, దీవెనలు కావాలి’’ అని శ్రేయ ట్వీట్ చేసింది. శ్రేయా ఘోషల్ తన మిత్రుడు శైలాదిత్యను 2015లో వివాహం చేసుకుంది. పలు భారతీయ భాషల్లో శ్రేయ పాటలు పాడి మధుర గాయనిగా పేరు తెచ్చుకుంది. ఆమె ప్రతిభకు అవార్డులు, రివార్డులు తార్కాణంగా నిలిచాయి