నవీన్ పొలిశెట్టి కోసం క్యూ కట్టిన ప్రముఖ నిర్మాణ సంస్థలు
Send us your feedback to audioarticles@vaarta.com
మొదటి సినిమా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాతో తన సత్తా చాటిన హీరో నవీన్ పొలిశెట్టి. ప్రస్తుతం ఈ యంగ్ హీరో నటించిన ‘జాతిరత్నాలు’ విడదలై బాక్సాఫీస్ దుమ్ము దులిపేస్తోంది. ఈ సినిమాతో ఒక రకంగా నవీన్ పొలిశెట్టి రేంజే మారిపోయింది. ప్రేక్షకులకు మరింత దగ్గరైపోయాడు. ఇక మీదట నవీన్ పొలిశెట్టి సినిమా అంటే చాలు.. రివ్యూలతో సంబంధం లేకుండా ప్రేక్షకులు థియేటర్ల బాట పడతారని తెలుస్తోంది. అంత క్రేజ్‌ను నవీన్ పొలిశెట్టి సంపాదించుకున్నాడు. ఇక నిర్మాతలు ఆగుతారా? నవీన్ పొలిశెట్టి దగ్గరకు క్యూ కట్టేస్తున్నారని తెలుస్తోంది.
నవీన్ పొలిశెట్టి.. ఇప్పుడు ఈ పేరు టాలీవుడ్ ఇండస్ట్రీలో మార్మోగుతోంది. అందుకు కారణం ‘జాతిరత్నాలు’ సినిమా సూపర్ డూపర్ హిట్టవ్వడమే. ఇలాగే ఇంకో రెండు మూడు హిట్లు పడితే నవీన్.. స్టార్ హీరోల సరసన చేరిపోతారనే టాక్ కూడా ఇండస్ట్రీలో బాగానే నడుస్తోంది. దర్శకులు సైతం కథతో నవీన్‌తో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఈ యంగ్ హీరో కోసం పేరుగాంచిన రెండు ప్రముఖ బ్యానర్స్ వెయిట్ చేస్తున్నాయని టాక్. దీంతో ఈ యంగ్ హీరో రేంజ్ ఎంతలా పెరిగిపోయిందో తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. లేటెస్ట్ మూవీతో వచ్చిన టాక్‌తో ఆయన్ను ప్రముఖ బ్యానర్స్ అయిన ‘యువీ క్రియేషన్స్’, ‘సితార ఎంటర్టైన్మెంట్స్’లో సినిమాలు చేయాలని నవీన్‌ను సంప్రదించగా.. టాప్ బ్యానర్స్ కావడంతో ఏ మాత్రం ఆలోచించకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ఒకవైపు నవీన్ పొలిశెట్టి.. మరో వైపు ఇంతటి ప్రముఖ బ్యానర్స్ అంటే.. ఈ సినిమాలకు భారీ హైప్ ఏర్పడుతుందనడంలో సందేహం లేదు. ఇక ఈ రెండు సినిమాలు హిట్ అయ్యాయంటే నవీన్ పొలిశెట్టి స్టార్ హీరోల సరసన మరో స్టార్లా నిలుస్తాడనడంలో సందేహం లేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments