'సోనీ లివ్' తెలుగు కంటెంట్ హెడ్ గా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత


Send us your feedback to audioarticles@vaarta.com


కరోనా ప్రభావంతో ఓటిటి లకు డిమాండ్ బాగా పెరిగింది. థియేటర్స్ లేకపోవడంతో ఎంటర్టైన్మెంట్ కోసం సినీ అభిమానులు ఓటిటి లపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనితో వివిధ ఓటిటి సంస్థలు పోటీపడి మరీ ప్రేక్షకులు కోరుకునే కంటెంట్ అందించేందుకు ప్రయత్నిస్తున్నాయి.
అంతర్జాతీయ స్థాయిలో ఎంటర్టైన్మెంట్ రంగంలో పేరున్న సంస్థ సోనీ. సోనీ సంస్థ తన ఓటిటి విభాగం 'సోనీ లివ్'పై ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు కోరుకునే కంటెంట్ అందించడానికి సరికొత్త నిర్ణయం తీసుకుంది. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత మధుర శ్రీధర్ ని సోనీ లివ్ తెలుగు కంటెంట్ హెడ్ గా నియమించింది.
మధుర శ్రీధర్ నియామకం పై సోని ఎంటర్టైన్మెంట్ టెలివిజన్ కంటెంట్ హెడ్ ఆశిష్ గొల్వకర్ స్పందించారు. సోని లివ్ తెలుగు కంటెంట్ హెడ్ గా మధుర శ్రీధర్ రెడ్డి గారు మాతో జాయిన్ అవడం సంతోషంగా ఉంది. తనకున్న అనుభవంతో వీక్షకులకు నచ్చే వైవిధ్యమైన కంటెంట్ ను తీసుకొస్తారని ఆశిస్తున్నాం. ప్రేక్షకులకు మరింత చేరువయ్యేలా సోని లివ్ ని శ్రీధర్ గారు అభివృద్ధి చేస్తారని నమ్ముతున్నట్లు ఆయన తెలిపారు.
మధుర శ్రీధర్ మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా వినోదరంగంలో సోనీ దిగ్గజ సంస్థ. ప్రపంచ వ్యాప్తంగా సోనీ లివ్ కు ఎంతో ఆదరణ ఉంది. ఆ లెగసీని తెలుగులో మరింత ముందుకు తీసుకువెళతాను. తెలుగు కంటెంట్ కి దేశవ్యాప్తంగా ఆదరణ లభించేలా ప్రయత్నిస్తా అని మధుర శ్రీధర్ అన్నారు.
మధుర శ్రీధర్ రెడ్డి వరంగల్ ఎన్ఐటీ లో ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేసి...ఐఐటీ మద్రాస్ లో మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేశారు. ఆ తర్వాత దిగ్గజ సాఫ్ట్ వేర్ కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్ర కంపెనీల్లో పనిచేశారు. సినిమా రంగంపై ఆసక్తితో టాలీవుడ్ లోకి వచ్చారు. దర్శకుడిగా, నిర్మాతగా తనదైన ముద్ర వేశారు.
బ్యాక్ బెంచ్ స్టూడెంట్, స్నేహగీతం లాంటి చిత్రాలని దర్శకుడిగా తెరకెక్కించారు. నిర్మాతగా మారి ఒక మనసు, ఎబిసిడి, దొరసాని లాంటి చిత్రాలని నిర్మించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
