బాలయ్య నిజ స్వరూపం బయటపెట్టిన ప్రముఖ నిర్మాత!
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ సీనియర్ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గురించి ఇండస్ట్రీలో.. రాజకీయాల్లో చాలా మంది ఏవేవో అంటుంటారు. కొందరైతే బాలయ్య బాగోతం ఇదిగో అని చెబుతుంటారు.. ఇంకొందరైతే చిత్ర విచిత్రాలుగా చెబుతుంటారు..? అయితే అసలు బాలయ్య ఇతరులతో ఎలా ఉంటారు..? ఇప్పటివరకూ ఆయన ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గానికి చేసిందేంటి..? ఆయన చేసిన పనులేంటి..? బాలయ్యనే ఎందుకు అంత టఫ్ ఫైట్‌లోనూ నియోజకవర్గ ప్రజలు గెలిపించుకున్నారు..? అనే విషయాలను టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, బీజేపీ నేత అంబికా కృష్ణ చెప్పుకొచ్చారు. ఇటీవల ఓ యూ ట్యూబ్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన.. బాలయ్య నిజ స్వరూపం బయటపెట్టారు. ఇంతకీ ఆయనేం చెప్పారు..? బాలయ్యతో ఆయనుకున్న అనుబంధమేంటి..? అనే విషయాలు ఈ కథనంలో చూద్దాం.
బాలయ్య నిజ స్వరూపం ఇదీ..!
‘బాలకృష్ణ చాలా మంచి వ్యక్తి. నాకు మంచి స్నేహితుడు. దైవ భక్తి ఉన్నటువంటి వ్యక్తి. మంచి ఆలోచనాపరుడు. ఆయన ఓపెన్ హార్ట్. ఆయన అనుకున్నది చెప్పేస్తారంతే.. గేట్లేమీ ఉండవ్. ఏదైనా సరే ఓపెన్ టాక్ అంతే. అందుకే నేను బాలయ్యను లైక్ చేస్తాను. అందరికీ బాలయ్య అంటే సినిమా యాక్టర్‌గా మాత్రమే తెలుసు. ఆయన నియోజకవర్గం హిందూపురంలో ఎన్నెన్ని మంచి పనులు చేశారో ఎవరికైనా తెలుసా..?. అమ్మో ఆయన నియోజకవర్గానికి చేసిన మంచి పనులు ఎవరూ చేయలేరు అంతే. నేను బాలయ్య కోసం 2014 ఎన్నికలప్పుడు నియోజకవర్గంలో క్యాంపయిన్ చేశాను. ఎవరు చూసినా సార్ మాకు బిందె నీళ్లు ఇవ్వండి సార్ అనేవాళ్లు.. అలాంటిది వాళ్లకు 24 గంటలూ డ్రింకింగ్ వాటర్ వచ్చే విధంగా పైపులైన్ వేయించారు. పెద్ద మార్కెట్‌ను ఊరి సెంటర్‌లో కొందరు ఆక్రమించేసి ఉన్నారు. వాళ్లందర్నీ ఖాళీ చేయించేసి షాపింగ్ మాల్స్ కట్టించి చిన్నవాళ్లకు అద్దెలకు ఇప్పించారు. ఇంకా చాలా చాలా మంచి పనులు చేశారు. చాలా మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. అందుకే 2019 ఎన్నికల్లో అంత పోటీలో కూడా అన్ని చోట్ల గెలవలేకపోయినా బాలకృష్ణ గెలిచారు. ఇది ఆయన పార్టీ గెలుపు కాదు.. బాలయ్యను చూసే అక్కడి జనాలు ఓట్లేశారు. ఆయన సొంత ఇమేజ్‌తోనే గెలిచారు. ఇన్ని పనులు చేసినా అందరికీ చెప్పుకోవాల్సిన అవసరం ఆయనకు లేదు.. అక్కడి జనాలకు మాత్రమే తెలుసు కాబట్టి ఆయన ఎవరికీ చెప్పుకోరు. జనాల హృదయాల్లో బాలయ్య ఉన్నారు’ అని అంబికా కృష్ణ చెప్పుకొచ్చారు.
వచ్చే ఏడాది సినిమా తీస్తా..
‘కచ్చితంగా మళ్లీ బాలయ్యే గెలుస్తారు.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆయనే గెలుస్తారు.. ఎన్ని ఎన్నికలొచ్చినా గెలుపు బాలయ్యదే. నియోజకవర్గంలో ఆయనుకుండే స్థానం అలాంటిది. అంత మంచి వ్యక్తి కాబట్టే ఆయనంటే నాకిష్టం. వచ్చే ఏడాది బాలయ్యతో సినిమా చేస్తాను. సినిమా అంటేనే వ్యాపారం.. అందరితోనే వేవ్ లెంత్ అనేది కలవదు. పక్కా కమర్షియల్ కాబట్టి సినిమా అనేది ఏమవుతుందో తెలియనివంటి ఒక లాటరీ లాంటిది. సినిమా తీస్తున్నాడంటే పుసుక్కున పోతే వచ్చే డబ్బులు కూడా రావేమో అనే ఒక భయం. వస్తేనేమో పిచ్చిగా వచ్చేస్తాయ్. సినిమా అంటే ఒక గ్యాంబ్లింగ్’ అని అంబికా వ్యాఖ్యానించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments