హెలికాఫ్టర్ ప్రమాదంలో ప్రముఖ క్రీడాకారుడు మృతి
Send us your feedback to audioarticles@vaarta.com
అమెరికా బాస్కెట్ బాల్ దిగ్గజం కోబ్ బ్రియాంట్ (41)హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి చెందారు. ఆయన మృతితో క్రీడాలోకం విషాదంలో మునిగిపోయింది. పూర్తి వివరాల్లోకెళితే.. కొబ్ బ్రయంట్ ప్రయాణిస్తున్న హెలీకాప్టర్ ఇవాళ క్రష్ అయింది. లాస్ ఏంజిల్స్‌కు అతి సమీపంలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కోబ్ మృతిపట్ల ఎన్బీఏ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్‌లోని ఒక్కరు కూడా ప్రాణాలతో మిగల్లేదు. హెలికాప్టర్ లోని మృతదేహాలన్నీ గుర్తుపట్టని విధంగా కాలిపోయాయి. ఈ ప్రమాదంలో ఆయన కూతురు సహా తొమ్మిది మంది తుదిశ్వాస విడిచారు. అమెరికన్ బాస్కెట్ బాల్ అసోసియేషన్-ఎన్బీఏ ఆల్ టైమ్ గ్రేట్ ప్లేయర్లలో ఒకరిగా కోబ్ గుర్తింపు తెచ్చుకున్నారు. 20 సంవత్సరాలకు పైగా క్రీడాభిమానులను అలరించిన ఘనత కోబ్ది. అంతేకాదు.. కొబ్ బ్రయంట్ 2012 ఒలింపిక్స్‌లో యూఎస్ టీమ్ తరపున ఆడి రెండు స్వర్ణపతకాలు అందుకున్నారు.
ట్రంప్ స్పందన..!
ఇదిలా ఉంటే.. కోబ్ దుర్మరణంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఆయన మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనతో పాటు పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు. మరోవైపు బ్రియాంట్ మృతి తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ తెలిపారు. ఈ వార్త వినడం దురదృష్టకరమని.. కోబ్ ఆత్మకు శాంతి చేకూరాలని కొహ్లీ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.
కేటీఆర్ సంతాపం!
ఇదిలా ఉంటే.. బ్రియాంట్ మృతిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు. ‘బ్రియాంట్, అతడి కుమార్తె మరణవార్త తెలిసి షాక్‌కు గురయ్యాను. ప్రపంచస్థాయి ఆటగాడికి నా కన్నీటి వీడ్కోలు’ అని ట్వీట్ చేశారు.
Shocked & anguished to learn that my fave Kobe Bryant & his daughter no more ??
— KTR (@KTRTRS) January 27, 2020
5x NBA champion
2x NBA finals MVP
4x All star MVP
2x NBA scoring champion
NBA slam dunk champion
No. 8, 24 retired by the Lakers
RIP & Tearful adieu to the fabulous #KobeBryant #BlackMamba pic.twitter.com/u0Mqwa2J9v
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com