'మా' ఎన్నికల్లో ఓటేసిన ప్రముఖులు
Send us your feedback to audioarticles@vaarta.com
‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికలు) మినీ సార్వత్రిక ఎన్నికలను తలపిస్తున్నాయి. ‘మా’ అధ్యక్ష పీఠం కోసం సీనియర్ నటులు నరేశ్.. శివాజీ రాజాలు పోటి పడుతున్నారు. గెలుపు తనదేనని నరేశ్ ధీమా వ్యక్తం చేస్తుండగా.. కచ్చితంగా రెండోసారి కూడా గెలుస్తానని నమ్మకంగా శివాజీ రాజా ఉన్నారు. ఆదివారం (మార్చి-10) ఉదయం 8గంటలకు ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్‌లో ఈ పోలింగ్ ప్రక్రియ జరగుతోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో మొత్తం 745 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
ఓటేసిన ప్రముఖులు..
ఉదయం 11 గంటల సమయంలో అక్కినేని నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి ఇద్దరూ కలిసొచ్చి ఓటేశారు. మరోవైపు సూపర్‌స్టార్ క్రిష్ణ దంపతులు కలిసొచ్చి ఓటేశారు. హీరో తరుణ్, మెగా ఫ్యామిలీ హీరోలు సాయిధరమ్ తేజ్, నాగబాబు, ఆర్ నారాయణమూర్తి, రాజీవ్ కనకాల, జీవితా రాజశేఖర్ దంపతులు, హీరోయిన్ ప్రియమణి, యాంకర్లు ఝాన్సీ, సుమ, సనాలతో పాటు పలువురు నటీనటులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఇదిలా ఉంటే.. సినీ ఇండస్ట్రీలోని బడా బడా ఫ్యామిలీలన్నీ దాదాపు నరేశ్ వైపే మొగ్గు చూపుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంత వరకు జరిగిన మా ఎన్నికలు ఈ రేంజ్‌లో జరగలేదనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే తాము మద్దతిస్తున్నట్లు మెగా బ్రదర్ నాగబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఓటేయమని అందరికీ చెబుతానని కూడా నాగబాబు చెప్పుకొచ్చారు. కాగా.. ఈ పోలింగ్ మధ్యాహ్నం 2గంటల వరకు జరగనుంది. ఇవాళ సాయంత్రం 5గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలు కానున్నట్లు సమాచారం. ఆదివారం రాత్రి 8 గంటలకల్లా ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout