కోవిడ్ తగ్గాక కీళ్ల నొప్పులు అందుకే.. టీకా, థర్డ్ వేవ్ గురించి ప్రముఖ ఆర్థోపెడిక్..
Send us your feedback to audioarticles@vaarta.com
కోవిడ్ నుంచి కోలుకున్నప్పటికీ కీళ్లు, కండరాలకు సంబంధించిన నొప్పులు వస్తున్నాయి. సెకండ్ వేవ్ లో ఈ పరిస్థితి ఇంకాస్త అధికంగా ఉంది. కరోనా నుంచి కోలుకున్న రెండు మూడు నెలల తర్వాత కూడా కీళ్లు, నరాల సమస్యలు అధికంగా ఉంటున్నాయని కొందరు పేషంట్లు చెబుతున్నారు. దీనిపై ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ దశరథరామరెడ్డి ఓ ఇంటర్వ్యూలో కీలక సమాచారం అందించారు.
ఇదీ చదవండి: ఈటల రాజేందర్ కు తృటిలో తప్పిన ప్రమాదం.. వేగంగా స్పందించిన పైలెట్
వైరస్ సోకినప్పుడు.. శరీరంలో వైరస్ కి, యాంటీ బాడీలకు పోరాటం జరుగుతుంది. ఈ సమయంలో కొన్ని విషపదార్థాలు(టాక్సిన్స్) విడుదలవుతాయి. ఈ టాక్సిన్స్ వల్ల కీళ్లు, కండరాల నొప్పులు వస్తున్నాయని అన్నారు. ఇది కేవలం తాత్కాలికమైన సమస్యే. ఈ నొప్పులు శాశ్వతంగా ఉండడం లేదు. యాంటీ ఇన్ ఫ్లెమేటరీ మందులు, ఒమేగా త్రి ఫ్యాటీయాసిడ్స్, కాల్షియం, విటమిన్ డి లాంటి సప్లమెంటరీలు తీసుకోవాలని డాక్టర్ అన్నారు. దీనివల్ల కీళ్లు, కండరాల సమస్యని అధికమించవచ్చు. అలాగే ఫిజియో థెరపీ, వ్యాయామాలు చేయడం కూడా మంచిది.
చిన్న చిన్న వ్యాయామాలు చేయాలి. నడక, యోగాసనాలు, ప్రాణాయామం చేయడం మంచి ఫలితాలు ఇస్తుంది. కాల్షియం, జింక్, విటమిన్ బి 12 లాంటి విటమిన్ ల సప్లమెంటరీలు తీసుకోవాలి. అలాగే జాయింట్ లూబ్రికెంట్స్ వాడాలి. ఉప్పు వేసిన గోరువెచ్చని నీటిలో చేతులు, కాళ్ళు పావుగంట పాటు ఉంచితే మంచి ఫలితాలు ఉంటాయని డాక్టర్ అన్నారు.
ఇక థర్డ్ వేవ్ విషయంలో దశరథరామిరెడ్డి చిన్న పిల్లలని హెచ్చరించారు. థర్డ్ వేవ్ విషయంలో ఇప్పటి నుంచే జాగ్రత్తలు అవసరం. మరో ఆరు నెలలపాటు చిన్న పిల్లలని బయట తిరగనీయకూడదు. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలతో బాధపడే పెద్దవారి వద్దకు వారిని వెళ్లనివ్వకూడదు. ఇంట్లోనే ఉండేలా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి.
కోవిడ్ టీకాల గురించి డాక్టర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హెచ్ ఐ వి వచ్చి 35 ఏళ్ళు గడుస్తోంది. ఇప్పటికి దానిపై ప్రభావవంతమైన టీకా కనుక్కోలేకపోయారు. కరోనా విషయంలో కొంత వరకు నయం. చాలా టీకాలు వచ్చాయి. అయితే కరోనా మ్యుటెంట్లు, వేరియంట్లు పెరుగుతుండడం వల్ల సమస్యలు వస్తున్నాయి అని అన్నారు.
సెకండ్ వేవ్ సమయంలో స్టెరాయిడ్స్ ఎక్కువగా వినియోగించారు. ఇది మంచిది కాదు. కొందరు ఆర్ఎంపీ వైద్యులు పేషంట్స్ కి అవసరానికి మించి స్టెరాయిడ్స్ ఇచ్చారు. దీనివల్ల హిప్ జాయింట్ సమస్యలు వస్తున్నాయి. కాబట్టి కోవిడ్ తగ్గాక మద్యపానం చేయకూడదు. స్టెరాయిడ్స్ వాడకం, దానికి మద్యపానం తోడైతే హిప్ జాయింట్ సమస్యలు ఎక్కువైపోతాయి అని దశరథరామిరెడ్డి హెచ్చరించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments