Yandamuri Veerendranath:యండమూరి వీరేంద్రనాథ్‌కు తృటిలో తప్పిన పెను ప్రమాదం

  • IndiaGlitz, [Friday,March 03 2023]

ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే.. గురువారం హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారును సిద్ధిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి శివారులో ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యండమూరి కారు వెనుక భాగం బాగా దెబ్బతింది. అయితే కారులో ప్రయాణిస్తున్న యండమూరి, డ్రైవర్ మాత్రం ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదానికి కారణమైన బస్సు గోదావరిఖని డిపోకు చెందినదిగా తెలుస్తోంది. యండమూరి వీరేంద్రనాథ్ కారు ప్రమాదానికి గురైందని తెలుసుకున్న పలువురు ప్రముఖులు ఆయనకు ఫోన్‌లు చేసి ఆరా తీస్తున్నారు.

చిరంజీవిని నవలా నాయకుడిని చేసిన యండమూరి:

ఇకపోతే.. 1948 నవంబర్ 14న తూర్పుగోదావరి జిల్లా రాజోలులో జన్మించిన వీరేంద్ర నాథ్‌ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయనలో ఓ ఛార్జర్ట్ అకౌంటెంట్, నవలా రచయిత, సినీ స్క్రిప్ట్ రైటర్, దర్శకుడు, వ్యక్తిత్వ వికాస బోధకుడు, జీవన విధానపు కౌన్సెలర్ దాగి వున్నారు. 1980ల నుంచి నేటి వరకు ఆయన రచించిన పుస్తకాలు లక్షల కొద్దీ కాపీలు, కోట్ల రూపాయల అమ్మకాలు జరిగాయని అంచనా. పేదరికంతో బాధపడుతున్నా సీఏ వంటి ప్రొఫెషనల్ కోర్సును కష్టపడి చదివారు. ఆయన రాసిన నవలలు సినిమాలుగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. చిరంజీవి- యండమూరి కాంబినేషన్ తెలుగు నాట హిట్ పెయిర్‌గా నిలిచింది. చిరంజీవిని నవలా నాయకుడిగా నిలబెట్టిన ఘనత యండమూరిదే.

More News

Sushmita Sen :సుస్మితా సేన్‌కు హార్ట్ ఎటాక్.. తీరిగ్గా చెప్పిన మాజీ మిస్ యూనివర్స్, ఉలిక్కిపడ్డ ఫిల్మ్ ఇండస్ట్రీ

సీనియర్ హీరోయిన్ , మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ గుండెపోటుకు గురయ్యారు.

Foxconn:తెలంగాణకు కొనసాగుతోన్న పెట్టుబడుల ప్రవాహం.. ‘ ఫాక్స్‌కాన్ ’ భారీ ఇన్వెస్ట్‌మెంట్

తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే వుంది. తాజాగా మరో ప్రతిష్టాత్మక సంస్థ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది.

Mahesh Babu:కండలు తిరిగి, నరాలు కనిపించేలా... మహేశ్ బాడీని చూశారా, ఫోటోలు వైరల్

సూపర్‌స్టార్ కృష్ణ గారి నటవారసుడిగా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చి.. తన మార్క్ యాక్టింగ్‌తో సూపర్‌స్టార్‌గా ఎదిగారు మహేశ్‌బాబు.

Ram Charan:ఆ నాలుగు సినిమాలు నా ఫేవరేట్.. అమెరికన్ హోస్ట్‌తో చరణ్ , అవేంటో తెలుసా..?

ఆస్కార్ నామినేషన్స్‌లో నిలవడంతో ఆర్ఆర్ఆర్ యూనిట్ మొత్తం అమెరికాలో సందడి చేస్తోంది.

రామ్‌చరణ్‌ని బ్రాడ్‌పిట్ ఆఫ్ ఇండియా అన్న అమెరికన్ టీవీ హోస్ట్.. చెర్రీ రియాక్షన్ ఇదే

ఇప్పుడు తెలుగు చిత్ర సీమతో పాటు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ చూపు.. ఆర్ఆర్ఆర్ సినిమాపైనే వుంది. ఆస్కార్ అవార్డ్స్ బరిలో ఈ చిత్రం