Yandamuri Veerendranath:యండమూరి వీరేంద్రనాథ్‌కు తృటిలో తప్పిన పెను ప్రమాదం
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే.. గురువారం హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారును సిద్ధిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి శివారులో ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యండమూరి కారు వెనుక భాగం బాగా దెబ్బతింది. అయితే కారులో ప్రయాణిస్తున్న యండమూరి, డ్రైవర్ మాత్రం ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదానికి కారణమైన బస్సు గోదావరిఖని డిపోకు చెందినదిగా తెలుస్తోంది. యండమూరి వీరేంద్రనాథ్ కారు ప్రమాదానికి గురైందని తెలుసుకున్న పలువురు ప్రముఖులు ఆయనకు ఫోన్‌లు చేసి ఆరా తీస్తున్నారు.
చిరంజీవిని నవలా నాయకుడిని చేసిన యండమూరి:
ఇకపోతే.. 1948 నవంబర్ 14న తూర్పుగోదావరి జిల్లా రాజోలులో జన్మించిన వీరేంద్ర నాథ్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయనలో ఓ ఛార్జర్ట్ అకౌంటెంట్, నవలా రచయిత, సినీ స్క్రిప్ట్ రైటర్, దర్శకుడు, వ్యక్తిత్వ వికాస బోధకుడు, జీవన విధానపు కౌన్సెలర్ దాగి వున్నారు. 1980ల నుంచి నేటి వరకు ఆయన రచించిన పుస్తకాలు లక్షల కొద్దీ కాపీలు, కోట్ల రూపాయల అమ్మకాలు జరిగాయని అంచనా. పేదరికంతో బాధపడుతున్నా సీఏ వంటి ప్రొఫెషనల్ కోర్సును కష్టపడి చదివారు. ఆయన రాసిన నవలలు సినిమాలుగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. చిరంజీవి- యండమూరి కాంబినేషన్ తెలుగు నాట హిట్ పెయిర్‌గా నిలిచింది. చిరంజీవిని నవలా నాయకుడిగా నిలబెట్టిన ఘనత యండమూరిదే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout