విజ‌య్ చిత్రంలో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు

  • IndiaGlitz, [Wednesday,September 12 2018]

విజ‌య్ దేవ‌ర కొండ ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడు. 'గీత‌గోవిందం' స‌క్సెస్‌తో త‌న రేంజ్ మారిపోయింది. విజ‌య్ హీరోగా చేస్తున్న సినిమాల‌పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇలాంటి త‌రుణంలో తెలుగు, త‌మిళంలో రూపొందుతోన్న బై లింగువ‌ల్ మూవీ నోటా పై అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

త‌మిళంలో 'అరిమ‌నంబి, ఇరు ముగ‌న్‌' చిత్రాల‌తో స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్నయువ ద‌ర్శ‌కుడు ఆనంద్ శంక‌ర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండ‌టంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ఈ సినిమాలో ప్రముఖ ద‌ర్శ‌కుడు ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ఓ కీల‌క పాత్ర‌లో క‌న‌ప‌డ‌బోతున్నాడ‌ట‌. ఆ ద‌ర్శ‌కుడెవ‌రో కాదు. ఎ.ఆర్‌.మురగ‌దాస్‌.. ఈ స్టార్ డైరెక్ట‌ర్ త‌న‌కు వీలున్న‌ప్పుడ‌ల్లా తెర‌పై న‌టుడిగా అలా క‌న‌ప‌డిపోతుంటారు.

ఇప్పుడు అలాంటి పాత్ర‌ను 'నోటా' చిత్రంలో చేయ‌బోతున్నార‌ట‌. ఈ విష‌యాన్ని ఆనంద్ శంక‌ర్ సోష‌ల్ మీడియాలో తెలియ‌జేశారు. మురుగ‌దాస్‌తో ఉన్న ఫోటోను కూడా షేర్ చేశాడు. ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.