విజయ్ చిత్రంలో ప్రముఖ దర్శకుడు
Send us your feedback to audioarticles@vaarta.com
విజయ్ దేవర కొండ ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడు. `గీతగోవిందం` సక్సెస్‌తో తన రేంజ్ మారిపోయింది. విజయ్ హీరోగా చేస్తున్న సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇలాంటి తరుణంలో తెలుగు, తమిళంలో రూపొందుతోన్న బై లింగువల్ మూవీ నోటా పై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తమిళంలో `అరిమనంబి, ఇరు ముగన్` చిత్రాలతో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నయువ దర్శకుడు ఆనంద్ శంకర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్ ఓ కీలక పాత్రలో కనపడబోతున్నాడట. ఆ దర్శకుడెవరో కాదు. ఎ.ఆర్.మురగదాస్.. ఈ స్టార్ డైరెక్టర్ తనకు వీలున్నప్పుడల్లా తెరపై నటుడిగా అలా కనపడిపోతుంటారు.
ఇప్పుడు అలాంటి పాత్రను `నోటా` చిత్రంలో చేయబోతున్నారట. ఈ విషయాన్ని ఆనంద్ శంకర్ సోషల్ మీడియాలో తెలియజేశారు. మురుగదాస్‌తో ఉన్న ఫోటోను కూడా షేర్ చేశాడు. ఈ చిత్రాన్ని అక్టోబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Iniya Vaishnavi
Contact at support@indiaglitz.com
Comments