టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్‌కు వైఎస్ జగన్ కీలక పదవి!?
- IndiaGlitz, [Monday,January 13 2020]
ఎస్వీబీసీ మహిళా ఉద్యోగితో ఆ చానెల్‌కు చైర్మన్‌గా ఉన్న థర్టీ ఇయర్స్ పృథ్వీ సరస సంభాషణ జరపడంతో ఆ వ్యవహారం చివరికి రాజీనామా దాకా వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఆయన స్థానంలో ఎవరొస్తారు..? ఎస్వీబీసీ చైర్మన్‌గా వ్యవహరించే బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారు..? ఆ అదృష్టం ఎవర్ని వరిస్తుంది..? అని ఆదివారం సాయంత్రం నుంచి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరోవైపు.. సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారినే ఈ పదవి వరిస్తుందా..? అనేదానిపై చర్చ జరిగింది.
డైరెక్టర్ నుంచి చైర్మన్‌గా..!
అయితే.. ఆ పదవి ఖాళీ అవ్వడంతో ఇప్పటికే వైసీపీకి చెందిన పలువురు ప్రముఖులు కర్చీఫ్ వేయగా.. వారెవ్వరినీ కాదని టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ డైరెక్టర్, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న శ్రీనివాస్‌రెడ్డిని నియమిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఆయన ఎస్వీబీసీ డైరెక్టర్‌గా వ్యవహరిస్తుండగా.. ఆయనకు ప్రమోషన్‌గా ఈ చైర్మన్ గిరి ఇవ్వాలని వైఎస్ జగన్ భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే ఆయన పేరును ఫిక్స్ చేసిన వైసీపీ ప్రభుత్వం.. అన్నీ అనుకున్నట్లు జరిగితే అతి త్వరలోనే అధికారికంగా ప్రకటన చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
అధికారిక ప్రకటన ఎప్పుడో!
ఇదిలా ఉంటే.. పృథ్వీ స్థానంలో మొదట ప్రముఖ యాంకర్, ఎస్వీబీసీ డైరెక్టర్‌గా ఉన్న స్వప్నకు చైర్మన్ గిరి కట్టబెడతారని వార్తలు వచ్చినప్పటికీ ఫైనల్‌గా శ్రీనివాస్‌నే ఫిక్స్ చేసినట్లు తాజా సమాచారం. శ్రీనివాస్ ‘ఢమరుకం’, ‘కుబేరులు’, ‘టాటా బిర్లా మధ్యలో లైలా’తో పాటు టాలీవుడ్‌లో పలు చిత్రాలను తెరకెక్కించి తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే.. వైఎస్ సన్నిహితుడు కావడంతో ఆయనకు కీలక పదవి వరించిందని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. మరి ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడాల్సిందే.