'ఆధార్' అంటున్న సీనియర్ కమెడియన్.. షూట్ స్టార్ట్!
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ కమెడియన్, తమిళ నటుడు కరుణాస్ కొత్త చిత్రం ప్రారంభం అయింది. చిత్రానికి విభిన్నంగా 'ఆధార్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తాజాగా విడుదల చేసిన టైటిల్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఆధార్.. ఫర్ రిజిస్ట్రేషన్ అనేది ట్యాగ్ లైన్. అలాగే టైటిల్ పైన 6840 5460 1834 ఆధార్ నంబర్ కూడా ఉంది.
తిరుణాల్ చిత్ర దర్శకుడు రాంనాథ్ పళణికుమార్ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఆధార్ మన జీవితాలతో ఎలా ముడిపడి ఉందో అందరికి తెలిసిందే. మరి చిత్రంలో నటుడు కరుణాస్ ఆధార్ తో ఎం చేయబోతున్నాడు.. దర్శకుడుని ఈ ఇంట్రెస్టింగ్ పాయింట్ చుట్టూ అల్లిన కథ ఏంటి అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
ఇదీ చదవండి: పడక గదిలో అంటూ డర్టీ కామెంట్స్.. శృంగార తార మనస్తాపం
ఈ చిత్ర షూటింగ్ తాజాగా ప్రారంభం అయింది. త్వరలోనే ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. యువ నటి రిత్విక ఈ చిత్రంలో ఫిమేల్ లీడ్ లో నటిస్తోంది. శ్రీ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.
వెన్నెల క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కరుణాస్ 2001 నుంచి తమిళ చిత్రాల్లో నటిస్తున్నారు. తెలుగులో ఆయన శ్వేత నాగు అనే చిత్రంలో నటించారు. యువ నటి రిత్విక కూడా తమిళ చిత్రాల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంటోంది. రిత్విక తమిళ బిగ్ బాస్ సీజన్ 2లో కంటెస్టెంట్ గా పాల్గొంది. బిగ్ బాస్ ఆమె గుర్తింపుని పెంచింది.
ఈ చిత్రంలో వినోదాత్మక అంశాలు ఉంటూనే కథ ఆసక్తికరంగా సాగుతుందట. దర్శకుడు రాంనాథ్ రూపొందించిన కథ అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ పేర్కొంది. పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com