ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్‌ఖాన్ ఇక లేరు..
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్‌ఖాన్(71) మరణించారు. గత కొంత కాలంగా శ్వాసకోశ సంబంధ సమస్యలతో ఆమె బాధపడుతున్నారు. జూన్ 20న ముంబై బాంద్రాలోని గురునానక్ ఆసుపత్రిలో చేరారు. కాగా శుక్రవారం తెల్లవారుజామున సరోజ్‌ఖాన్ గుండెపోటుతో మృతి చెందారని ఆమె కూతురు వెల్లడించారు. కాగా ఆమె ఆసుపత్రిలో చేరిన సమయంలోనే కరోనా పరీక్షలు చేయగా నెగిటివ్ అని తేలింది. 1950లో బాల నటిగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సరోజ్‌ఖాన్.. నాలుగు దశాబ్దాలకు పైగా బాలీవుడ్‌లో కొరియోగ్రాఫర్‌గా కొనసాగారు. 2 వేల సినిమా పాటలకు కొరియోగ్రఫీ చేశారు.
ఆమె చివరి సారిగా 2019లో కరణ్ జోహార్ నిర్మించిన ‘కళంక్’ చిత్రంలో మాధురీ పాటకు కొరియోగ్రఫీ అందించారు. తేజాబ్‌లో మాధురీ దీక్షిత్ నర్తించిన ‘ఏక్ దో తీన్’, దేవదాస్ సినిమాలోని ‘దోలా రే దోలా’, జబ్ వీ మెట్ సినిమాలోని ‘యే ఇష్క్ హై’ పాటల కొరియోగ్రఫీకి సరోజ్ ఖాన్‌కు జాతీయ అవార్డులు లభించాయి. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ‘చూడాలని ఉంది’ చిత్రానికి కూడా ఆమె కొరియోగ్రఫీ అందించారు. ఈ చిత్రానికి ఆమె నంది అవార్డును కూడా అందుకున్నారు. సరోజ్ ఖాన్ మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments