ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్‌ఖాన్ ఇక లేరు..

  • IndiaGlitz, [Friday,July 03 2020]

బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్‌ఖాన్(71) మరణించారు. గత కొంత కాలంగా శ్వాసకోశ సంబంధ సమస్యలతో ఆమె బాధపడుతున్నారు. జూన్ 20న ముంబై బాంద్రాలోని గురునానక్ ఆసుపత్రిలో చేరారు. కాగా శుక్రవారం తెల్లవారుజామున సరోజ్‌ఖాన్ గుండెపోటుతో మృతి చెందారని ఆమె కూతురు వెల్లడించారు. కాగా ఆమె ఆసుపత్రిలో చేరిన సమయంలోనే కరోనా పరీక్షలు చేయగా నెగిటివ్ అని తేలింది. 1950లో బాల నటిగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సరోజ్‌ఖాన్.. నాలుగు దశాబ్దాలకు పైగా బాలీవుడ్‌లో కొరియోగ్రాఫర్‌గా కొనసాగారు. 2 వేల సినిమా పాటలకు కొరియోగ్రఫీ చేశారు.

ఆమె చివరి సారిగా 2019లో కరణ్ జోహార్ నిర్మించిన ‘కళంక్’ చిత్రంలో మాధురీ పాటకు కొరియోగ్రఫీ అందించారు. తేజాబ్‌లో మాధురీ దీక్షిత్ నర్తించిన ‘ఏక్ దో తీన్’, దేవదాస్ సినిమాలోని ‘దోలా రే దోలా’, జబ్ వీ మెట్ సినిమాలోని ‘యే ఇష్క్ హై’ పాటల కొరియోగ్రఫీకి సరోజ్ ఖాన్‌కు జాతీయ అవార్డులు లభించాయి. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ‘చూడాలని ఉంది’ చిత్రానికి కూడా ఆమె కొరియోగ్రఫీ అందించారు. ఈ చిత్రానికి ఆమె నంది అవార్డును కూడా అందుకున్నారు. సరోజ్ ఖాన్ మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

More News

నందిత శ్వేతా నటించిన 'IPC 376' మూవీ ట్రైలర్ విడుదల

పవర్ కింగ్ స్టూడియో బ్యానర్ పై ఎస్.ప్రభాకర్ సమర్పణలో హీరోయిన్ నందిత శ్వేతా ప్రధాన పాత్రలో వస్తోన్న చిత్రం IPC 376.

చివరి నిమిషంలో న‌వీన్ చంద్ర సినిమా టైటిల్ మార్పు

న‌వీన్ చంద్ర హీరోగా శ్రీకాంత్ నాగోతి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ‘భానుమ‌తి రామ‌కృష్ణ‌’. స‌లోని లుథ్రా హీరోయిన్‌గా న‌టిస్తుంది.

వామ్మో ఎమ్మెల్సీ సీటా?.. భయపడిపోతున్న వైసీపీ నేతలు

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం మొదలైంది. నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయిన నేపథ్యంలో ఎన్నికలు జరగనున్నాయి.

'కళాపోషకులు' టైటిల్ కాన్సెప్ట్ పోస్టర్ ను విడుదల చేసిన ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి

శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ పై విశ్వకార్తికేయ, దీప ఉమావతి హీరో హీరోయిన్స్ గా తెరకెక్కబోతున్న సినిమా కళాపోషకులు.

రఘురామ విషయంలో వైసీపీ కీలక నిర్ణయం.. రేపు ఢిల్లీకి ఎంపీలు

వైసీపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. వైసీపీ నేతలకు వ్యతిరేకంగా ఇటీవల ఆ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణరాజు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.