Salaar : 'సలార్ '.. పోస్టుపోన్ అవుతుందని ముందే చెప్పిన గురూజీ, 100 శాతం నిజమైన అంచనా
Send us your feedback to audioarticles@vaarta.com
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘‘సలార్’’ మూవీ రిలీజ్ డేట్‌పై సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను నిజం చేస్తూ యూనిట్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బుధవారం సోషల్ మీడియాలో అధికారిక ప్రకటన విడుదల చేశారు నిర్మాతలు. దీంతో కోట్లాది మంది అభిమానులు నిరాశలో కూరుకుపోయారు. అయితే సలార్ వాయిదా పడుతుందని ప్రముఖ జ్యోతిష్యుడు సాయి మోహన్ ఎప్పుడో చెప్పారు.
‘‘ www.indiaglitz.com ’’కి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో ప్రభాస్ జాతకం గురించి ఎన్నో కీలక విషయాలను ఆయన వెల్లడించారు. ఈ క్రమంలోనే ‘‘సలార్’’ ఖచ్చితంగా వాయిదా పడుతుందని సాయి మోహన్ కొన్ని రోజుల ముందే అంచనా వేశారు. ఆయన చెప్పింది నూటికి నూరు పాళ్లు నిజమైంది. ప్రభాస్ జాతకానికి అనుగుణంగా సంఖ్యా శాస్త్రం పరంగా ‘‘1’’తో వచ్చే డేట్‌లో సలార్ రిలీజ్ చేస్తే ఈ విజయం ఘన విజయం సాధిస్తుందని ఆయన వెల్లడించారు. అంతేకాదు.. బాహుబలికి మించిన వసూళ్లు, పేరు ప్రఖ్యాతులను ప్రభాస్‌కు తెచ్చిపెడుతుందని సాయి మోహన్ తెలిపారు. ఆయన సూచన మేరకు సలార్ చిత్ర యూనిట్ చేస్తుందేమో చూడాలి.
కాగా.. సలార్ విడుదలపై సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ చిత్ర నిర్మాతలు బుధవారం స్పందించారు. సెప్టెంబర్ 28న సలార్ రావడం లేదంటూ చావు కబురు చల్లగా చెప్పింది. ఈ మేరకు బుధవారం సోషల్ మీడియాలో అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘‘సలార్ అనుకున్న టైంకి విడుదల చేయలేకపోతున్నందుకు చింతిస్తున్నాం.. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. త్వరలోనే కొత్త డేట్ అనౌన్స్ చేస్తాం’’ అని చిత్ర యూనిట్ వెల్లడించింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. లాంగ్ వీకెండ్‌తో పాటు వరుస సెలవులు కలిసొచ్చిన మంచి టైంను సలార్ మిస్ చేసుకుందని బాధపడుతున్నారు. అయితే సలార్ విడుదల లేకపోవడంతో ఈ టైంని క్యాష్ చేసుకునేందుకు మిగిలిన చిత్రాలు పోటీ పడుతున్నాయి.
ఇందులో ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా నటించింది. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, ఈశ్వరీ రావు, శ్రీయా రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ సలార్ ను నిర్మిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com