"ఆదిత్యా థాక్రే.. సిగ్గుగా అనిపించట్లేదా..!?"

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో భారత దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఉంటున్న వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ ప్రధాని మోదీ లాక్‌డౌన్ కీలక ప్రకటన చేస్తారని.. ఇంటికెళ్లిపోవచ్చని వేయి కళ్లతో వేచి చూసిన వారు చివరికి వారి ఆశలన్నీ అడియాసలే అయ్యాయి. దీంతో మే-03వరకు ఇక్కడే ఉండలేమని తమ స్వస్థలాలకు వెళ్లిపోతామని వలస కార్మికులు ఒక్కసారిగా పెద్ద ఎత్తున నగరంలోని బాంద్రా రైల్వే స్టేషన్‌ ముందు ఆందోళన నిర్వహించారు. సుమారు 1500 మందికిపైగా కార్మికులు రోడ్లపైకి వచ్చి గుమిగూడారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ వలస కూలీలపై లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది.

ఆదిత్య థాక్రే ట్వీట్ ఇదీ..

అసలు కరోనా కేసులు అత్యధికంగా ఉన్న ఈ సమయంలో ప్రభుత్వం కఠిన చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాల్సిన టైమ్‌లో కేంద్రం ‘మహా సర్కార్’ దుమ్మెత్తి పోస్తోంది. ఈ క్రమంలో యువనేత, సీఎం ఉద్దవ్ థాక్రే కుమారుడు ఆదిత్య థాక్రే చేసిన ట్వీట్స్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. ‘ 24 గంటలు రైళ్లను నడపాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఇది వరకే పలుమార్లు వేడుకున్నాం. వలస కూలీలు వాళ్ల స్వస్థలాలకు వెళ్లడానికి మాత్రమే తాము ఈ వినతి కేంద్రానికి చెప్పాం. ఇటీవల ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ విషయాన్నే తాము కేంద్రం దృష్టికి తీసుకెళ్లాం. ఇప్పటికే మా ప్రభుత్వం 70,399 వలస కూలీలకు వసతి కల్పించింది’ అని ఇలా ఇంకా చాలా చాలానే ట్విట్టర్‌లో ఆయన రాసుకొచ్చారు.

సిగ్గుగా అనిపించట్లేదా..!?

ఇవాళ బాంద్రాలో జరిగిన ఘటన, ఆదిత్య థాక్రే ట్వీట్స్‌పై ప్రముఖ అనలిస్ట్, యాంకర్ షెహ్‌జాద్ ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు. ఆదిత్య చేసిన రెండు ట్వీట్స్‌ తాలుకూ ఫొటోలను పోస్ట్ చేస్తూ.. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వాన్ని మీరు నిందిస్తున్నారా..? బాంద్రా ఘటనతో మీ సర్కార్ పూర్తిగా విఫలమైందని చెప్పుకొచ్చారు. అంతటితో ఆగని ఆయన.. గత కొద్దిరోజులుగా వలస కార్మికుల కోసం ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో అందరికీ తెలుసని ఒకింత వ్యగ్యంగా షెహ్‌జాద్ ట్వీట్స్ చేశారు. ఆదిత్యా.. ఇలాంటి సందర్భాల్లో మీరు చేస్తున్న పనులకు, విమర్శలకు కొంచెం కూడా సిగ్గుగా అనిపించట్లేదా..? అని విమర్శిస్తూ ఆయన ట్వీట్ చేశారు. అనంతరం ఈ ట్వీట్‌ను మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులకు ఆయన ట్యాగ్ చేశారు.

More News

దేశంలోని సంపన్నులకు షా విన్నపం.. ప్రజలకు భరోసా!

మే-03వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేసిన విషయం విదితమే. ఏప్రిల్-20 తర్వాత పరిస్థితులను బట్టి కొన్ని సడలింపులు ఉంటాయని..

హీరోయిన్ శ్రియ భర్తకు కరోనా లక్షణాలు..!

దక్షిణాది అందాల నటి.. ఒకప్పుడు టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపిన సీనియర్ నటి శ్రియ అందరికీ గుర్తుండే ఉంటుంది. పెళ్లయిన తర్వాత స్పెయిన్‌లోనే భర్తతో కలిసి ఉంటోంది.

మ‌హేశ్ కూడా ఎంట్రీ ఇచ్చేస్తున్నాడు..?

సినిమా మాధ్య‌మంకు స‌మాంతరంగా ఎదుగుతుంది డిజిట‌ల్ మాధ్య‌మం. అమెజాన్‌, హాట్ స్టార్‌, నెట్‌ఫ్లిక్స్ వంటి టాప్ డిజిట‌ల్ మాధ్య‌మాలే కాకుండా మ‌రిన్ని ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్

బాల‌య్య 106 ప్లాన్ అదేనా?

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టిస్తోన్న 106 చిత్రం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కుతోంది. తొలి షెడ్యూల్ పూర్త‌యిన

పవన్ ‘వకీల్‌సాబ్’ మ‌రింత వెనక్కి..?

పవర్‌స్టార్‌, జ‌న‌సేనాని రీ ఎంట్రీ మూవీ ‘వకీల్‌సాబ్‌’. ముందుగా ఈ చిత్రాన్ని మే 15న విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు దిల్‌రాజు, బోనీ క‌పూర్ భావించారు.