కరోనాతో ప్రముఖ నటుడి మృతి
Send us your feedback to audioarticles@vaarta.com
సీనియర్ నటుడు,‘మహాభారతం’ సీరియల్ ఫేమ్ సతీష్ కౌల్(66) కరోనా బారిన పడి మృతి చెందారు. కొద్ది రోజులుగా కరోనాతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వారం రోజుల క్రితం సతీష్ కౌల్‌కు కరోనా సోకింది. ఆయనను కుటుంబ సభ్యులు పంజాబ్‌లోని లుథియానా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. సతీష్ కౌల్ గత వారం రోజులుగా అక్కడే చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు.
బీఆర్ చోప్రా నిర్మించిన మహాభారతం సీరియల్‌తో పాటు కర్మ, వారెంట్, ప్రేమ్ ప్రభాత్, గునాహో కా ఫైస్లా వంటి హిందీ చిత్రాల్లో నటించారు. పలు నాటక ప్రదర్శనల్లో పాల్గొని నటుడిగా మంచి పేరును సంపాదించుకున్నారు. నాటకరంగంతో పాటు సీరియల్స్, సినిమాల్లో రాణించినప్పటికీ గత కొద్ది కాలంగా సతీష్ కౌల్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాయం చేయాల్సిందిగా పలువురిని ఆయన అభ్యర్థించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ ఆయన వైద్య ఖర్చుల నిమిత్తం సతీష్ కౌల్‌కు 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు.
1954 సెప్టెంబర్ 8న ఆయన కశ్మీర్‌లో జన్మించిన సతీష్ కౌల్..ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్టీఐఐ) 1969 బ్యాచ్‌లో గ్రాడ్యుయేషన్ చేశారు. బాలీవుడ్ నటులు జయ బచ్చన్, శత్రుఘ్న సిన్హా, జరీనా వహాబ్, డానీ డెంజోంగ్పా, ఆశా సచ్‌దేవా, ఓం పూరి వంటి వారితో కలిసి ఆయన తన గ్రాడ్యుయేషన్‌ను కొనసాగించారు. సతీష్ కౌల్ ప్రధానంగా పంజాబీ సినిమాల్లో నటించారు. అతను 300 కి పైగా చిత్రాలలో పనిచేశారు. మహాభారతం సీరియల్‌లో ఇంద్ర పాత్ర పోషించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments