విషాదం: రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటుడు మృతి.. స్నేహితుడితో బైక్ పై..
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా విజృంభణతో సినీ ప్రముఖులు చాలా మంది ప్రాణాలు వదిలారు. ఇది చాలదు అన్నట్లు కొన్ని దురదృష్ట సంఘటనలు కూడా సినీ ప్రముఖుల ప్రాణాలు బలిగొంటున్నాయి. తాజాగా జాతీయ అవార్డు అందుకున్న ప్రముఖ కన్నడ నటుడు సంచారి విజయ్ (38) ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చదవండి: చిరంజీవి మానవత్వానికి కేంద్రమంత్రి ఫిదా!
శనివారం అర్థరాత్రి బెంగళూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయ్ తీవ్ర గాయాల పాలయ్యాడు. అతడి పరిస్థితి విషమంగానే ఉంది. తాజాగా సంచారి విజయ్ తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. దీనితో కన్నడ సినీ లోకం విషాదంలో మునిగిపోయింది. విజయ్ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
38 ఏళ్ల పిన్న వయసులోనే విజయం మృతి చెందడం జీర్ణించుకోలేని సంఘటనగా మారింది. ఇంతటి విషాదంలో కూడా ఆయన కుటుంబ సభ్యులు అవయవ దానం చేసేందుకు ముందుకు వచ్చారు.
శనివారం అర్థరాత్రి ఈ ప్రమాదం జరిగింది. విజయ్ తన స్నేహితుడు నవీన్ ఇంట్లో డిన్నర్ పూర్తి చేసుకుని తిరిగి బయలుదేరాడు. ఇద్దరూ బైక్ లో ప్రయాణిస్తుండగా బైక్ స్కిడ్ కావడంతో సమీపంలో ఉన్న కరెంట్ పోల్ ని బలంగా ఢీకొట్టింది. నవీన్ కు గాయాలైనప్పటికీ అతడు కోలుకుంటున్నాడు. కానీ విజయ్ కి బలమైన గాయాలు కావడంతో సమీపంలోని ఆసుపత్రిలో వెంటనే ఐసీయూలోకి తరలించారు. బ్రెయిన్ డెడ్ కావడం, తర్వాత విజయ్ ప్రాణాలు కోల్పోవడం జరిగింది.
ప్రమాద సమయంలో నవీన్ బైక్ రైడ్ చేసినట్లు తెలుస్తోంది. నగరంలో వర్షాల వల్ల రోడ్లు తడిగా మారాయి. అందువల్లే బైక్ స్కిడ్ పోలీసులు తెలిపారు. అయినప్పటికీ నవీన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. లాక్ డౌన్ సమయంలో పేద పిల్లలకు విజయ్ ఉచిత రేషన్, మెడిసిన్స్ అందించారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
విజయ్ మృతి పట్ల కన్నడ స్టార్ కిచ్చా సుదీప్, సంయుక్త హెగ్డే తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విజయ్ తదుపరి చిత్రం గురించి అనేక గొప్ప విషయాలు విన్నాను. ఆ చిత్రం విడుదల కాకముందే, చిన్న వయసులో విజయ్ ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం అని సుదీప్ ట్వీట్ చేశారు.
Very very disheartening to accept that Sanchari Vijay breathed his last.
— Kichcha Sudeepa (@KicchaSudeep) June 14, 2021
Met him couple of times just bfr this lockdown,,,, all excited about his nxt film,, tats due for release.
Very sad.
Deepest Condolences to his family and friends.
RIP ????
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com