Manobala : చిత్ర పరిశ్రమలో విషాదం.. హాస్యనటుడు మనోబాల కన్నుమూత

  • IndiaGlitz, [Wednesday,May 03 2023]

చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. కోలీవుడ్‌కు చెందిన హాస్య నటుడు, దర్శకుడు మనోబాల కన్నుమూశారు. ఆయన వయసు 69 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తమిళంలో హాస్యనటుడిగా పేరు తెచ్చుకున్న ఆయన డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగువారిని అలరించారు. తెలుగులో మహానటి, దేవదాసు, రాజ్‌దూత్, వాల్తేర్ వీరయ్య వంటి సినిమాల ద్వారా కడుపుబ్బా నవ్వించారు. మనోబాల మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

More News

Viral Video: ఆర్టీసీ బస్సు వెనుక కాలు పెట్టి యువకుడి బైక్ డ్రైవింగ్.. వీడియో వైరల్

తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన వీసీ సజ్జనార్ తనదైన వ్యూహాలతో సంస్థను గాడిలో పెట్టేందుకు  ప్రయత్నిస్తున్నారు.

Chiyaan Vikram:తంగలాన్ షూటింగ్‌లో ప్రమాదం.. చియాన్ విక్రమ్‌‌కు తీవ్రగాయాలు, ఆందోళనలో ఫ్యాన్స్

చియాన్ విక్రమ్.. విలక్షణ నటనకు, క్రమశిక్షణకు, అంకితభావానికి ఆయన పెట్టింది పేరు.

JD Chakravarthy:జేడీ చక్రవర్తికి ఇంటర్నేషనల్ అవార్డ్.. కెరీర్‌లో తొలిసారి, ఎక్కడికెళ్లినా ఆ సినిమా గురించే

జేడీ చక్రవర్తి.. ఈ పేరు తెలియని తెలుగువారుండరు. రామ్‌గోపాల్ వర్మ శిష్యుల్లో ఆయన కూడా ఒకరు.

Geoffrey Hinton:కృత్రిమ మేధతో జాగ్రత్త.. ప్రపంచానికి చెప్పాలని గూగుల్‌లో ఉద్యోగానికి ‘‘గాడ్‌ఫాదర్ ఆఫ్ ఏఐ’’ గుడ్‌బై

శాస్త్ర , సాంకేతిక రంగాలు ప్రస్తుతం కొత్తపుంతలు తొక్కుతున్న సంగతి తెలిసిందే. ఏ రోజుకారోజు కొత్త కొత్త సాఫ్ట్‌వేర్‌లు, యాప్‌లు , ఎన్నో సాధనాలు పుట్టుకొస్తున్నాయి.

Vimanam:'విమానం' సినిమా నుంచి 'రేలా రేలా' లిరిక‌ల్ సాంగ్ రిలీజ్

ఓ చిన్న కుర్రాడు..అత‌నికి విమానం ఎక్కాల‌ని ఎంతో ఆశ‌.. కానీ ఎలా? ఎప్పుడు విమానాన్ని చూసినా అలా ఆనందం, ఆశ్చ‌ర్యంతో చూస్తూనే ఉండిపోతాడు.