"పవన్ కళ్యాణ్‌కి కథ అక్కర్లేదు!"

  • IndiaGlitz, [Tuesday,June 01 2021]

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలాంటి కథతో సినిమా చేస్తే బావుంటుంది? టాప్ రైటర్ వి. విజయేంద్ర ప్రసాద్ అయితే పవన్‌కి కథ అవసరం లేదంటున్నారు. పవర్ స్టార్ సినిమాలపై పంచ్ వేశారో, లేదంటే నిజంగా మనసులో మాట చెప్పారో కానీ పవన్‌ అంతకు ముందు చేసిన సినిమాల్లో సీన్లు కొన్ని తీసి మళ్ళీ సినిమా చేసేస్తే చాలు అంటున్నారు.

ఇదీ చదవండి: మెగాస్టార్ ఆక్సిజన్ బ్యాంక్స్ పై ఎమ్మెల్యే కామెంట్

పవన్ కళ్యాణ్ కి కథ రాయక్కర్లేదు. ఆయన సినిమాల్లో అక్కడక్కడి సీన్లు నాలుగు తీసి, పేర్లు మార్చి పెట్టేస్తే చాలు. సరిపోతుంది. పవన్ కళ్యాణ్ సినిమా చూడటానికి వచ్చినవాళ్ళకు ఏమీ అక్కర్లేదు. అందమైన పాటలు పాడాలి. అమ్మాయిలతో డ్యాన్సులు చేయాలి. విలన్లను ఇరగొట్టాలి. కథ అక్కర్లేదు. ఆయనను చూడడం కోసం ప్రజలు వస్తారు. ప్రజలకు మంచి చేయడం వంటి సీన్లు ఉంటే చాలు. ఆయన సినిమాలు చూసి అక్కడో సీను, అక్కడో సీను పెట్టేస్తే కథ కంప్లీట్ అవుతుంది అని విజయేంద్రప్రసాద్ ఒక టాక్ షోలో చెప్పారు. పవన్ కళ్యాణ్ కి ఎలాంటి కథ రాస్తారన్న ప్రశ్నకు ఆయన చెప్పిన ఆన్సర్ ఇది.

ఒకవేళ రజనీకాంత్ కి కథ రాయాల్సి వస్తే ఆయనను రావణాసురుడిగా చూపిస్తూ రాస్తానని విజయేంద్రప్రసాద్ అన్నారు. కమల్ హాసన్ అన్ని క్యారెక్టర్లు చేసేశారు కాబట్టి ఆయనకు కథ రాయడం వేస్ట్ అన్నారు. అమితాబ్ బచ్చన్ ను అయితే మహా పిసినిగొట్టోడు కింద చూపిస్తానని అన్నారు. ఆయన అలాంటి క్యారెక్టర్ చేయలేదు కాబట్టి కొత్తగా ఉంటుందట.

More News

నేటి నుంచి బ్యాంకుల పనివేళల్లో మార్పులు

తెలంగాణలో లాక్‌డౌన్‌ పాక్షిక సడలింపుతో బస్సులు, మెట్రో రైళ్లతో పాటు బ్యాంకుల పని వేళల్లో సైతం మార్పులు సంభవించాయి. మారిన వేళల ప్రకారం..

'ఆర్ఆర్ఆర్'లో ఎన్టీఆర్, చరణ్ కొట్టుకుంటే?

'ఆర్ఆర్ఆర్'లో ఎన్టీఆర్, రామ్ చరణ్ కొట్టుకుంటారా? ఇద్దరి మధ్య భారీ ఫైట్ ఉందా? అంటే... దర్శకధీరుడు రాజమౌళి తండ్రి, రచయిత వి. విజయేంద్రప్రసాద్ చెప్పిన మాటలు వింటే 'అవును'

మెగాస్టార్ ఆక్సిజన్ బ్యాంక్స్ పై ఎమ్మెల్యే కామెంట్

కరోనా సమయంలో తన వంతు భాద్యతగా మెగాస్టర్ చిరంజీవి చేస్తున్న సేవా కార్యక్రమాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆర్థిక సహాయాలు, విరాళాలు ఇలా ఎన్నో విధాలుగా

బాలయ్యకు కోపం ఎక్కువే.. ఖైదీ, సైరా మధ్యలో ఏం జరిగిందంటే..

తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్ పేరు చెప్పగానే ముత్తు, నరసింహ, దశావతారం, స్నేహం కోసం లాంటి సెన్సేషనల్ చిత్రాలు గుర్తుకు వస్తాయి. తమిళంలో అద్భుతమైన క్రేజ్ సొంతం చేసుకున్న దర్శకుడు

రెండు సార్లు ఛాన్స్ మిస్.. టాలీవుడ్ స్టార్ హీరోపై ప్రియమణి

వివాహం తర్వాత ప్రియమణి సినిమాల జోరు తగ్గించింది. బుల్లితెర షోలలో కనిపిస్తోంది. ప్రియమణి తెలుగులో నటించి చాలా కాలమే అవుతోంది.