"పవన్ కళ్యాణ్‌కి కథ అక్కర్లేదు!"
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలాంటి కథతో సినిమా చేస్తే బావుంటుంది? టాప్ రైటర్ వి. విజయేంద్ర ప్రసాద్ అయితే పవన్‌కి కథ అవసరం లేదంటున్నారు. పవర్ స్టార్ సినిమాలపై పంచ్ వేశారో, లేదంటే నిజంగా మనసులో మాట చెప్పారో కానీ పవన్ అంతకు ముందు చేసిన సినిమాల్లో సీన్లు కొన్ని తీసి మళ్ళీ సినిమా చేసేస్తే చాలు అంటున్నారు.
ఇదీ చదవండి: మెగాస్టార్ ఆక్సిజన్ బ్యాంక్స్ పై ఎమ్మెల్యే కామెంట్
"పవన్ కళ్యాణ్ కి కథ రాయక్కర్లేదు. ఆయన సినిమాల్లో అక్కడక్కడి సీన్లు నాలుగు తీసి, పేర్లు మార్చి పెట్టేస్తే చాలు. సరిపోతుంది. పవన్ కళ్యాణ్ సినిమా చూడటానికి వచ్చినవాళ్ళకు ఏమీ అక్కర్లేదు. అందమైన పాటలు పాడాలి. అమ్మాయిలతో డ్యాన్సులు చేయాలి. విలన్లను ఇరగొట్టాలి. కథ అక్కర్లేదు. ఆయనను చూడడం కోసం ప్రజలు వస్తారు. ప్రజలకు మంచి చేయడం వంటి సీన్లు ఉంటే చాలు. ఆయన సినిమాలు చూసి అక్కడో సీను, అక్కడో సీను పెట్టేస్తే కథ కంప్లీట్ అవుతుంది" అని విజయేంద్రప్రసాద్ ఒక టాక్ షోలో చెప్పారు. పవన్ కళ్యాణ్ కి ఎలాంటి కథ రాస్తారన్న ప్రశ్నకు ఆయన చెప్పిన ఆన్సర్ ఇది.
ఒకవేళ రజనీకాంత్ కి కథ రాయాల్సి వస్తే ఆయనను రావణాసురుడిగా చూపిస్తూ రాస్తానని విజయేంద్రప్రసాద్ అన్నారు. కమల్ హాసన్ అన్ని క్యారెక్టర్లు చేసేశారు కాబట్టి ఆయనకు కథ రాయడం వేస్ట్ అన్నారు. అమితాబ్ బచ్చన్ ను అయితే మహా పిసినిగొట్టోడు కింద చూపిస్తానని అన్నారు. ఆయన అలాంటి క్యారెక్టర్ చేయలేదు కాబట్టి కొత్తగా ఉంటుందట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments