రేపు జగన్ టూర్.. కాన్వాయ్ కోసం కారు లాక్కెళ్లిన కానిస్టేబుల్, నడిరోడ్డుపై కుటుంబం
Send us your feedback to audioarticles@vaarta.com
పలు నిర్ణయాలతో విమర్శలు మూట కట్టుకున్న ఏపీలోని వైఎస్ జగన్ ప్రభుత్వం మరో వివాదంలో చిక్కుకుంది. ముఖ్యమంత్రి కాన్వాయ్ కోసం తిరుపతి వెళ్తున్న భక్తుల నుంచి కారును లాక్కొన్న ఘటన సంచలనం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళితే... పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన వేమల శ్రీనివాస్ తన ఆరుగురు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తోంది. వీరు ప్రయాణిస్తోన్న ఇన్నోవా కారు రాత్రి పది గంటలకు ఒంగోలులోని ఓ హోటల్ ముందు ఆపారు.
అక్కడ దిగి టిఫిన్ చేస్తుండగా ఓ కానిస్టేబుల్ వచ్చాడు. ఈ కారు ఎవరిదని అడిగాడు. మాదే అని చెప్పాడు శ్రీనివాస్. 22న సీఎం జగన్ పర్యటన ఉందని.. సీఎం కాన్వాయ్ కోసం వెహికల్ కావాలని చెప్పారు. డ్రైవర్ కూడా కావాలని తీవ్ర జ్వరంతో గద్దించాడు. తామంతా తిరుపతి వెళ్తున్నామని ఇప్పుడు ఇవ్వలేమని చెప్పినా సదరు కానిస్టేబుల్ పట్టించుకోలేదు. ఉన్నతాధికారులు ఆదేశించారని... సారీ చెబుతూ కారు, డ్రైవర్‌ని తీసుకెళ్లిపోయాడు.
దీంతో దైవ దర్శానానికి బయల్దేరిన శ్రీనివాస్ ఫ్యామిలీ రోడ్డున పడింది. అర్థరాత్రివేళలో ఎటు వెళ్లాలో తెలియక తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. సీఎం కాన్వాయ్ కోసం వెహికల్స్ కావాలంటే స్థానికుల నుంచి తీసుకోవాలి కానీ... ఇలా దూర ప్రాంతాల నుంచి వచ్చే వారిని టార్గెట్ చేయడమేంటని వాపోయింది.
ఈ ఘటనపై టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. సీఎం కాన్వాయ్ కోసం ప్రజల కారు లాక్కెళ్ళడం దౌర్భాగ్యపు పాలనకు నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ కోసం కారు పెట్టుకోలేని స్థితికి రాష్ట్రం ఎందుకు వెళ్ళిందా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు చంద్రబాబు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com