సుప్రీంకోర్టు జ్యుడీషియల్ కమిషన్‌ను ఆశ్రయించిన దిశ నిందితుల కుటుంబ సభ్యులు

  • IndiaGlitz, [Monday,November 02 2020]

దిశ నిందితుల కుటుంబ సభ్యులు మరోసారి సుప్రీంకోర్టు జ్యుడీషియల్ కమిషన్‌ను ఆశ్రయించారు. దీంతో దిశ ఎన్‌కౌంటర్ చిత్రం మరోమారు తెరపైకి వచ్చింది. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న దిశ ఎన్‌కౌంటర్ చిత్రాన్ని నిలిపి వెయ్యాలని కోరుతూ హైకోర్టులోని జ్యుడీషియల్ కమిషన్ కార్యాలయానికి దిశ నిందితుల కుటుంబ సభ్యులు చేరుకున్నారు. ఇప్పటికే ఈ చిత్రాన్ని ఆపాలని దిశ తండ్రి శ్రీధర్‌రెడ్డి హైకోర్టును కోరారు.

దిశ ఎన్‌కౌంటర్ చిత్రంలో తమ వాళ్లను విలన్లుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని నిందితులు జోళ్లు శివ, జోళ్ళు నవీన్, చెన్నకేశవులు, హైమ్మద్ ఆరీఫ్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
సుప్రీంకోర్టు కమిషన్‌కు విరుద్ధంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఓ పక్క విచారణ జరుగుతుంటే సినిమా ఎలా తీస్తారని నిందితుల కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. తమ కుటుంబ సభ్యులతో పాటు పిల్లల మీద కూడా.. ఈ సినిమా ప్రభావం పడుతుందని ఫిర్యాదు చేశారు. చనిపోయిన వారిని ఈ చిత్రం తీసి ఇంకా చంపుతున్నారని కమిషన్‌కు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఈ చిత్రం తీయడం వలన కుటుంబ సభ్యుల జీవించే స్వేచ్ఛకు భంగం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే రామ్ గోపాల్ తీస్తున్న చిత్రాన్ని నిలిపి వెయ్యాలని కుటుంబ సభ్యులు కమిషన్‌ను కోరారు. న్యాయవాదుల సమక్షంలో కమిషన్‌కు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.

More News

తమిళ ‘ఎర్ర’ స్మగ్లర్లు వర్సెస్ కడప లోకల్ గ్యాంగ్.. నలుగురు సజీవ దహనం

తెల్లవారు జామున కడప జిల్లా ఎయిర్ పోర్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్‌ను సుమో ఢీకొనడంతో నలుగురు వ్యక్తులు సజీవదహనమయ్యారు.

హీరోగా ఎంట్రీ ఇస్తున్న సుమ, రాజీవ్‌ల తనయుడు రోషన్..

ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల కుటుంబం నుంచి ఓ యంగ్ హీరో టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నాడు.

రేపటి నుంచి ఏపీ, తెలంగాణల మధ్య బస్సులు పున: ప్రారంభం..

తెలుగు రాష్ట్రాల మధ్య నలుగుతున్న అంతరాష్ట్ర బస్సుల సమస్య ఓ కొలిక్కి వచ్చింది.

పోరాట యోధుడు, వీరుడు, శూరుడిని కాపాడిన నాగ్..

టైటిల్ కాస్త వెటకారంగా అనిపిస్తున్నా ఇది మాత్రం నిజమే. హోస్ట్ నాగార్జున ప్రైవేట్ జెట్‌లో వచ్చి మరీ అమ్మ రాజశేఖర్‌ని కాపాడారు.

నోయెల్ ఒక సైకోగాడన్న అమ్మ.. ఈ వారం నో ఎలిమినేషన్..

సండే.. రానే వచ్చింది. ఇవాళ హౌస్‌లో సందడే సందడి. ఫన్ డే నిజంగా అదిరిపోయింది. జర జరా నవ్వరాదే పిల్లా సాంగ్‌తో షో స్టార్ట్ అయింది.