ఎస్.జానకి ఆరోగ్యంపై వదంతులు.. వివరణనిచ్చిన కుటుంబ సభ్యులు

  • IndiaGlitz, [Monday,June 29 2020]

భారతీయ ప్రముఖ నేపథ్య గాయని ఎస్.జానకి గురించి ఒక్కసారిగా వదంతులు వ్యాపించాయి. సోషల్ మీడియాలో ప్రముఖుల గురించిన రూమర్స్ కామన్‌గానే వస్తుంటాయి కానీ ఇక వారు లేరన్న వదంతులు స్ప్రెడ్ అయితే మాత్రం వారి కుటుంబ సభ్యులతో పాటు అభిమానులను సైతం కలచివేస్తాయి. జానకమ్మ విషయంలోనూ ఇలాంటి వదంతులే వ్యాపించాయి. దీంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. దీనిపై జానకమ్మ కుటుంబ సభ్యులు వివరణ ఇచ్చారు.

ఏదో చిన్న అనారోగ్య సమస్య కారణంగా ఆమెకు మైనర్ సర్జరీ జరిగిందని.. ప్రస్తుతం కోలుకుంటున్నారని తెలిపారు. బయట వినిపించే వార్తలను నమ్మవద్దన్నారు. ఆమె క్షేమంగా ఉన్నారన్నారు. దయచేసి ఇలాంటి వార్తలను నమ్మవద్దని జానకమ్మ కుటుంబ సభ్యులు సూచించారు. జానకమ్మ తెలుగులోనే కాకుండా పలు భాషల్లో 50 వేలకు పైగా పాటలు పాడారు. ఉత్తమ గాయనిగా వివిధ రాష్ట్రాల నుంచి 31 సార్లు, జాతీయ పురస్కారం 4 సార్లు అందుకున్నారు. కాగా ఇటీవల తానిక పాటలు పాబోనంటూ ఓ స్టేజ్‌పై నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి జానకమ్మ పాటలు పాడటం లేదు.

More News

అలీ హీరోగా నటిస్తోన్న 53వ చిత్రం ‘మా గంగానది’ ట్రైల‌ర్ విడుద‌ల‌

అలీ, నియా హీరో హీరోయిన్లుగా ర‌వికుమార్ స‌మ‌ర్ప‌ణ‌లో మూకాంబికా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై వి.బాల నాగేశ్వ‌ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో

తెలంగాణ హోంమంత్రికి కరోనా పాజిటివ్

తెలంగాణలో కరోనా రోజు రోజుకూ ఉగ్రరూపం దాలుస్తోంది. కేసుల సంఖ్య కూడా తీవ్ర స్థాయిలో నమోదవుతోంది.

హైదరాబాద్‌లో మరోసారి లాక్‌డౌన్.. భయపడాల్సిందేమీ లేదన్న కేసీఆర్

జీహెచ్‌ఎంసీ పరిధిలో మరోసారి లాక్‌డౌన్‌కు సమయం  ఆసన్నమైంది. రోజు రోజుకూ జీహెచ్ఎంసీ పరిధిలోనే వందల సంఖ్యలో కేసులు నమోదవుతుండటంతో

'స‌రిగ‌మగ‌మ' లిరిక‌ల్ సాంగ్‌తో ఆకట్టుకుంటోన్నరాజ్‌ తరుణ్ ‘ఒరేయ్‌ బుజ్జిగా'

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో

ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఫ్యాన్స్‌ను కెలుకుతున్న వ‌ర్మ‌!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను, అత‌ని అభిమానుల‌ను వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ త‌న‌కు ప‌బ్లిసిటీ కావాల్సిన‌ప్పుడల్లా కెలుకుతుంటాడు.