ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో చిరంజీవి 150వ చిత్రం ప్రారంభం..
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖుల సమక్షంలో ఈరోజు ప్రారంభమైంది. ఈ చిత్రానికి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిరంజీవి పై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు క్లాప్ నివ్వగా మెగా బ్రదర్ నాగబాబు గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ రత్నవేలు కాగా సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్. ఈ చిత్రాన్ని 2017 సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రం ప్రారంభోత్సంకు ఫ్యామిలీ మెంబర్స్ అల్లు అరవింద్, అల్లు అర్జున్, సాయిథరమ్ తేజ్ తదితరులతో పాటు కొరటాల శివ, శరత్ మరార్, జెమిని కిరణ్, డి.వి.వి. దానయ్య, తిరుపతి ప్రసాద్ హాజరయ్యారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com