విలన్ గా ఫ్యామిలీ హీరో...

  • IndiaGlitz, [Friday,June 30 2017]

ఇప్పుడు సీనియర్‌ హీరోస్‌ అందరూ విలన్స్‌గా మారుతున్నారు. జగపతిబాబు, వడ్డే నవీన్‌, అర్జున్‌, శరత్‌కుమార్‌ తదితరులు ఈ వరుసలో ముందున్నారు. తాజాగా ఈ లిస్టులోకి ఫ్యామిలీ హీరో శ్రీకాంత్‌ కూడా చేరుతున్నాడని సమాచారం. నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 102వ చిత్రం కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కనుంది. జూలై రెండో వారం నుండి ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ తుది దశకు చేరుకుంది.
అందులో భాగంగా విలన్‌గా నటించడానికి యూనిట్‌ వర్గాలు శ్రీకాంత్‌ను కలిశాయట. శ్రీకాంత్‌ కూడా విలన్‌గా చేయడానికి ఆసక్తిగానే ఉన్నాడట. అలాగే హీరోయిన్‌గా నయనతార నటించనుందట. ఈ చిత్రాన్ని సి.కళ్యాణ్‌ నిర్మిస్తాడు. ప్రస్తుతం బాలకృష్ణ 'పైసా వసూల్‌' చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా దసరా సందర్భంగా సెప్టెంబర్‌ 29న విడుదల కానుంది.