హైదరాబాద్‌లో దారుణం.. వ్యక్తి ప్రాణాన్ని బలిగొన్న తప్పుడు రిపోర్టు
Send us your feedback to audioarticles@vaarta.com
తీవ్ర అనారోగ్యం పాలైన వ్యక్తికి హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రుల్లో బెడ్ దొరకడం కష్టమైంది. చివరికి ఎలాగోలా దొరికిందిలే అనుకుంటే కరోనా టెస్ట్‌లో నెగిటివ్ అని తేలింది. లక్షణాలు చూస్తే తీవ్ర కరోనాతో బాధపడుతున్నట్టుగా ఉంది. కనీసం బ్రీతింగ్ తీసుకోవడం కూడా చాలా కష్టమైంది. చివరకు ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆ సమయంలో కుటుంబ సభ్యులు ఆయనకు రెమిడెసివీర్‌ను ఇవ్వాలని కోరగా.. నెగిటివ్ వచ్చి ఉండటంతో వైద్యులు నిరాకరించారు. పది రోజుల పాటు ప్రకాష్ కరోనాతో పోరాడి చివరకు తుది శ్వాస విడిచారు. అప్పుడు పరీక్ష నిర్వహించగా పాజిటివ్ వచ్చింది.
హైదరాబాద్‌కు చెందిన 51 ఏళ్ల బిజినెస్ మ్యాన్ ప్రకాష్(పేరు మార్చబడింది) తీవ్ర జ్వరంతో పాటు విపరీతమైన దగ్గుతో బాధపడ్డారు. మొదట సీజనల్ ఫ్లూగా భావించినప్పటికీ తరువాత బ్రీతింగ్ ప్రాబ్లమ్ కూడా ఆయన అనారోగ్యంలో చేరిపోయింది. ఆక్సీజన్ లెవల్స్ చెక్ చేయగా సాధారణం కంటే తక్కువగా ఉంది. దీంతో ఆయన కుటుంబం వెంటనే ఆయనను ఆసుపత్రిలో జాయిన్ చేయాలని భావించింది. ఆసుపత్రిలో బెడ్ సంపాదించడం ఎంత కష్టమనేది వారికప్పుడు తెలియలేదు. ఒక ఆసుపత్రి నుంచి మరో ఆసుపత్రికి తండ్రీ కొడుకులు బెడ్ కోసం విపరీతంగా తిరగాల్సి వచ్చింది. మొదట సన్ షైన్ హాస్పిటల్.. అక్కడ నాలుగు గంటలపాటు వేచి చూసినా బెడ్ దొరకలేదు. తరువాత మెడికోవర్ హాస్పిటల్ అక్కడి నుంచి యశోదా.. ఆ తరువాత కిమ్స్.. చివరికి జోయ్ హాస్పిటల్‌లో బెడ్ దొరికింది.
కాగా ప్రకాష్ జులై 6న జోయ్ ఆసుపత్రిలో జాయిన్ అవగా.. జులై 8న ఆయన స్వాబ్ సేకరించిన ఆసుపత్రి వైద్యులు కరోనా టెస్ట్ కోసం విజయ డయాగ్నస్టిక్స్ పంపారు. జులై 9న ఫలితం నెగిటివ్ వచ్చింది. దీంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కానీ ఆయన జ్వరం, దగ్గు, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ అలాగే ఉన్నాయి.ఒక వారం తరువాత ప్రకాష్‌కు ఆరోగ్యం కుదుట పడకపోవడంతో తిరిగి ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు రెమిడెస్‌వీర్ మెడిసిన్ ఇవ్వాలని వైద్యులను కోరగా.. నెగిటివ్ వచ్చిందని.. అలాంటపుడు కరోనా కోసం వాడే మందును ఆయనకు వాడలేమని తేల్చి చెప్పారు. పది రోజులపాటు ఆసుపత్రిలోనే అనారోగ్యంతో పోరాడుతూ ఉన్నారు. జులై 17న ప్రకాష్‌ను వెంటిలేటర్‌పై పెట్టినట్టు ఆసుపత్రి వైద్యులు ఆయన కుటుంబానికి వెల్లడించారు. ఆ రోజు సాయంత్రమే ప్రకాష్ చనిపోయారని కుటుంబ సభ్యులకు వైద్యులు తెలిపారు. చనిపోయిన అనంతరం నిర్వహించిన పరీక్షలో ప్రకాష్‌కు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన డయాగ్నస్టిక్ సెంటర్‌ది తొలి నిర్లక్ష్యమైతే.. కుటుంబ సభ్యులు గుర్తించిన విషయాన్ని కూడా వైద్యులు గుర్తించలేకపోవడం దారుణమని పలువురు అభిప్రాయపడుతున్నారు. లక్షల్లో ఆ కుటుంబం డబ్బు నష్ట పోవడమే కాకుండా.. ఇంటికి పెద్ద దిక్కును సైతం కోల్పోయి తీవ్ర మనోవేదనకు గురవతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments