తెలంగాణ కరోనాపై తప్పుడు ప్రచారాలు చేస్తే కేసులే..: ఈటల

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ భారీన పడి వందల సంఖ్యలో చనిపోగా.. వేలాది మంది అనుమానితులుగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. చైనాలోని వూహాన్‌లో పుట్టిన ఈ వైరస్ ప్రపంచ దేశాలకు పాకింది. ఇప్పటికే 271 దేశాలకు పాకినట్లు నిపుణులు చెబుతున్నారు. భారత్‌కూ పాకడంతో పాటు.. తెలుగు రాష్ట్రాలకూ కోవిడ్-19 వైరస్ వచ్చేసింది. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు జంకుతున్నారు. ఇప్పటికే బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి కరోనాతో హైదరాబాద్ ఆస్పత్రిలో చనిపోవడంతో.. ఎప్పుడేం జరుగుతుందో అని జనాలు జంకుతున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటోంది. రోజురోజుకూ ఈ కరోనా విస్తరిస్తుండటం.. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా షాపింగ్ మాల్స్ మొదలుకుని.. థియేటర్స్ వరకూ అన్నీ బంద్ చేస్తున్నట్లు సర్కార్ ప్రకటించింది.

కఠిన చర్యలే..
అయితే.. ఇదిగో కరోనా.. అదుగో కరోనా.. పాజిటివ్ వచ్చేసిందంటూ మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు, పుకార్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఇలా తప్పుడు, దుష్ప్రచారాలు చేస్తున్న వారికి కళ్లెం వేయాలని భావించిన తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా పాజిటివ్ అంటూ ఎవరైనా సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం చేస్తే వారిపై కేసులు పెట్టాలని ఆదేశాలు జారీ చేశామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తేల్చిచెప్పారు. మరోవైపు మీడియాకు సున్నితంగానే మంత్రి విజ్ఞప్తి చేశారు.

దయచేసి ఎవరూ తప్పుడు వార్తలు సర్క్యులేట్ చేయవద్దని స్పష్టం చేశారు. కాగా.. హైదరాబాద్‌లో ముగ్గురికి కరోనా వచ్చిందని సోషల్ మీడియాలో, వాట్సాప్‌లో అసత్య ప్రచారాలపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. మంత్రి ఫిర్యాదుపై సైబర్‌క్రైమ్ పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటిస్తే తప్ప.. తెలంగాణలోని కరోనా పాజిటివ్ కేసులను ఎవరూ ప్రకటించకూడదని స్పష్టం చేశారు. అపోహలను, అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని ఈటెల ఈ సందర్భంగా సూచించారు.

More News

షాకింగ్ రోల్‌లో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌?

ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత ఏక‌ధాటిగా సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్నాడు.

అల్లు అయాన్ అభిమాన హీరో ఎవ‌రో తెలుసా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త‌న‌యుడు అల్లు అయాన్ బాలీవుడ్ యాక్ష‌న్ స్టార్ టైగ‌ర్ ష్రాఫ్‌కు పెద్ద అభిమానట‌.

ఏపీలో ఎన్నికలు యథావిథిగా జరుగుతాయా..!?

కరోనా నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ఆదివారం నాడు కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిదే.

మాస్ రాజాతో మిల్కీ బ్యూటీ..!!

మాస్ మ‌హారాజా ర‌వితేజ ఏక‌ధాటిగా వ‌రుస సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్నారు. ప్ర‌స్తుతం క్రాక్ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు ర‌వితేజ‌.

కరోనా ఎఫెక్ట్: ‘అరణ్య’ వాయిదా

అనుకున్నట్లే అయ్యింది. రానా దగ్గుబాటి టైటిల్ పాత్రలో ప్రభుసాల్మన్ దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రం ‘అరణ్య’.