Falaknuma Das Review
లోకల్ టాలెంట్ ఎదగడం ఎప్పుడూ ముఖ్యమే. `పెళ్లిచూపులు`తో సినిమా లోకల్ టాలెంట్‌కి మరింత దగ్గరైందనే చెప్పాలి. ఆ సినిమా దర్శకుడు తరుణ్ భాస్కర్ వెతికి పట్టుకున్న మరో హీరో విశ్వక్ సేన్. నటుడి నుంచి దర్శకుడిగా ఎదిగి, ప్రొడక్షన్ చూసుకుని, అన్నీ తానై చేసిన సినిమా `ఫలక్‌నుమా దాస్`. ఫలక్‌నుమా అనగానే అందరికీ అందమైన ప్యాలస్ గుర్తుకొస్తుంది. కానీ దాని చుట్టూ ఉన్న బస్తీ, అందులో ఉన్న ఓ దాస్.. వాళ్ల కథను కళ్లకు కట్టాలని విశ్వక్ సేన్ ఈ సినిమాను తీశారట. మరి ఆయన ఉద్దేశాన్ని సినిమాలో ప్రేక్షకులూ చూడగలిగారా... ఆలస్యమెందుకు? తెలుసుకోండి మరి.
కథ:
ఫలక్‌నామాలో ఉండే శంకరన్నను చూసి దాస్(విశ్వక్‌సేన్) అతని స్నేహితులు చదువుకంటే గొడవలంటే ఆసక్తి చూపిస్తారు. దాస్ తన స్నేహితులతో పెరిగి పెద్దై ఓ గ్యాంగ్‌ను క్రియేట్ చేసుకుంటాడు. ఈలోపు శంకరన్నను రవి, రాజు అనే ఇద్దరు కుర్రాళ్లు చంపేస్తారు. చెల్లెలి పెళ్లి చేయాలి... తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి.. వీటన్నింటికీ డబ్బు కావాలి. కాబట్టి దాస్, పాండు(ఉత్తేజ్), స్నేహితులతో కలిసి మటన్ బిజినెస్ ప్రారంభిస్తాడు. ఓ బార్ గొడవలో రవి, రాజు బావమరిదిని దాస్ కొడతాడు. అతను దాస్‌పై పడబడతాడు. ఓ గొడవలో దాస్ అరెస్ట్ అవుతాడు. ఆ హత్య కేసు నుండి బయటపడాలంటే దాస్‌కి పాతిక లక్షలు అవసరం అవుతుంది. అప్పుడు దాస్ ఏం చేస్తాడు? డబ్బు సంపాదించే క్రమంలో అతను ఫేస్ చేసే సవాళ్లేంటి? చివరకు దాస్ మర్డర్ కేసు నుండి బయటపడ్డాడా లేదా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
సమీక్ష:
సినిమా అంటే మన సంస్కృతి, వేషధారణ, భాష అన్నింటిని ఎలివేట్ చేసే ఓ మాధ్యమం. ఇలాంటి సినిమా ద్వారా మనం చెప్పే కంటెంట్ ఆలోచింపచేసేదిగా ఉండాలి. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం. అలాగే మరోకోణంలో సినిమా అంటే ఎంటర్‌టైన్‌మెంట్. ఎన్నోబాధలతో సతమయ్యే మనిషికి రిలాక్స్ ఇచ్చే మాధ్యమాల్లో సినిమా ప్రధానమైంది. వీటన్నింటిని కాకుండా కొన్ని సినిమాలు కొంత మంది పర్టికులర్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తూ తెరకెక్కిస్తారు. వాటిలో కొన్ని చిత్రాలు మంచి విజయాలను సాధించాయి. సినిమా ఏదైనా కావచ్చు. భారీ బడ్జెట్‌లో అయినా.. లో బడ్జెట్‌లో అయినా సినిమాలో కంటెంట్ ప్రధానం. థియేటర్‌లో ఆడియెన్‌ను కూర్చొపెట్టగలిగితే సినిమా సక్సెస్ అయినట్లే. ఇక ఫలక్‌నుమా దాస్ ఓల్డ్ సిటీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిందే.
`ఫలక్‌నుమాదాస్` .. అంటే ఫలక్‌నామాలో ఉండే దాస్ అనే కుర్రాడి కథ, అని ఎవరికైనా అర్థమవుతుంది. టైటిల్ పాత్రలోనటిస్తూ సినిమాను తెరకెక్కించడం కాస్త జఠిలమైన విషయమే. దీన్ని విశ్వక్‌సేన్ భుజాలకెత్తుకున్నాడు. ఎవరో తనను మోయడం ఎందుకు? తనను తానే మోసుకోవాలనుకున్న ఆలోచన బావుంది. పరిమితమైన ప్రాంతంలో సినిమా చేసేటప్పుడు అక్కడి పరిస్థితులను సినిమాలో ఆవిష్కరించాల్సిందే. దాన్ని విశ్వక్‌సేన్ సమర్ధవంతంగా చేశాడు. సినిమాలో బూతులు, తాగే సన్నివేశాలకు కొదవలేదు. రెండు, మూడు లిప్ లాక్ సన్నివేశాలున్నాయి. హీరోయిన్ పాత్రలకు పెద్ద స్కోప్ లేదు. ఇక విలన్స్‌గా నటించినవారు నటన పరంగా ఆకట్టుకున్నారు. సినిమాలో ఇన్‌స్పెక్టర్ పాత్రలో నటించిన తరుణ్ భాస్కర్ ఉన్నంతలో సూపర్బ్ పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఉత్తేజ్ పాత్రకు మంచి ఇంపార్టెన్స్ ఉంది. వివేక్ సాగర్ సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ మెప్పించలేదు. విద్యాసాగర్ చింత సినిమాటోగ్రఫీ పరావాలేదు. సినిమా ఫస్టాఫే ఓ రేంజ్‌లో ఉంటే.. ఇక సెకండాఫ్ సంగతి సరేసరి! మరి బోరింగ్‌గా ఉంది. మన నెటివిటీని సినిమాల ద్వారా పొట్రేట్ చేయవచ్చు. కానీ ఎన్ని వేషాలైన వేయ్చొచ్చు కానీ బలమైన కథ అవసరం. బలమైన ఎమోషన్స్ అవసరం అవేమీ సినిమాలో కనపడవు.
బోటమ్ లైన్: ఫలక్‌నుమా దాస్.. పరిమితం
Read Falaknuma Das Movie Review in English
- Read in English