మే 31న 'ఫ‌ల‌క్‌నుమా దాస్‌' విడుద‌ల‌

  • IndiaGlitz, [Monday,May 20 2019]

విశ్వ‌క్ సేన్ హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం 'ఫ‌ల‌క్‌నుమా దాస్‌'. వాజ్ఞ్మ‌యి క్రియేష‌న్స్ క‌రాటే రాజు స‌మ‌ర్ప‌ణ‌లో విశ్వ‌క్ సేన్ సినిమాస్‌, టెర్ర‌నోవా పిక్చ‌ర్స్ బ్యాన‌ర్స్‌ పై ఈ చిత్రాన్ని కరాటే రాజు, చ‌ర్ల‌ప‌ల్లి సందీప్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. మీడియా 9 మ‌నోజ్‌కుమార్ కో ప్రొడ్యూస‌ర్‌. సెన్సార్ స‌హా అన్నీ కార్య‌క్ర‌మాల్ని  పూర్తి చేసి   ఈ సినిమాను మే 31న విడుద‌ల చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా హీరో, ద‌ర్శ‌కుడు విశ్వక్ సేన్ మాట్లాడుతూ సినిమా ను ఇటీవల 100 మంది దాకా చూశారు. చూసిన వాళ్లంతా సినిమా బాగుందని ప్రశంసలు కురిపించారు. తప్పకుండా అందరికీ నచుతుంది. మే 31న సినిమాను రిలీజ్ చేస్తున్నాం అన్నారు.

నిర్మాత క‌రాటే రాజు మాట్లాడుతూ... హైదరాబాద్ కల్చర్ ని ప్రతిభింబిస్తుంది. అందరకీ నచ్చేలా సినిమా ఉంటుంది

తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ నేను ఇందులో నటించా. మొదట్లో విశ్వక్ మీద నమ్మకం లేకుండెను. కానీ ఓ షార్ట్ ఫిల్మ్ చూపించారు. అప్పుడు విశ్వాక్ మీద నమ్మకం కలిగింది. ఇది మలయాళం సినిమా కి రీమేక్ అని తెలిసిందే అన్నారు.

డి.సురేష్ బాబు మాట్లాడుతూ మే 31న సినిమా రిలీజ్ అవుతుంది.ఈ సినిమా తెలుగు సినిమా కి కొత్త. విశ్వక్ తాను నటిస్తూ... దర్శకత్వం చేశారు. తరుణ్ భాస్కర్ బాగా నటించారు. విశ్వాక్ ఎంతో ఇష్టం తో సినిమా చేశారు. ఇందులో సంభాషణలు చాలా రియల్ స్టిక్ గా ఉన్నాయి. దీన్ని ఓ ఆర్ట్ ఫిల్మ్ లా కాకుండా... కమర్షియల్ చిత్రంగా బాగా తీశారు. సంగీతం బాగుంది అన్నారు.

హీరోయిన్ స‌లోని మిశ్రా మాట్లాడుతూ ఇందులో రా కంటెంట్ ప్రేక్షకులకు బాగా నచుతుంది. చూసి ఎంజాయ్ చేయండి. విశ్వక్ న‌టిస్తూ చ‌క్క‌గా డైరెక్ట్ చేశారుఅన్నారు.

More News

నాజ‌ర్‌ పై సోద‌రుల ఆరోప‌ణ‌లు

సీనియ‌ర్ న‌టుడు నాజ‌ర్‌ పై అత‌ని సోద‌రులు ఆయ‌బ్‌, జ‌వ‌హ‌ర్ మీడియా ముఖంగా ఆరోప‌ణ‌లు చేశారు. నాజ‌ర్ కుటుంబంలో న‌లుగురు అబ్బాయిలు అందులో చివ‌రి వాడు మాన‌సిక వ్యాధితో బాధ‌ప‌డుతున్నాడు.

బ‌న్నీ సిస్ట‌ర్ సెంటిమెంట్

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే తొలి షెడ్యూల్ కూడా పూర్త‌య్యింది. త‌ర్వ‌లోనే సెకండ్ షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ కానుంది.

మాట నిల‌బెట్టుకున్న లారెన్స్‌

కొరియోగ్రాఫ‌ర్ నుండి ద‌ర్శ‌కుడిగా ఎదిగిన రాఘ‌వ లారెన్స్ సినిమాల‌తో పాటు స‌మాజ సేవ కూడా చేస్తుంటాడు. గుండె జ‌బ్బుతో బాధ‌ప‌డే చిన్న‌పిల్ల‌ల‌కు ఆప‌రేష‌న్‌

కేంద్రంలో మళ్లీ ఎన్డీఏనే.. కాంగ్రెస్‌కు కన్నీరే..!?

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరం ప్రజల నాడి ఎలా ఉందన్న విషయంలో జాతీయ, ప్రాంతీయ మీడియా సంస్థలు తమ సర్వే ఫలితాలను వెల్లడించాయి.

తెలంగాణలో ఆక్టోపస్ అట్టర్‌ ప్లాప్.. ఏపీలో పరిస్థితేంటి!?

ఏపీలో అధికారంలోకి ఎవరొస్తారో మాజీ ఎంపీ, ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ తేల్చిచెప్పేశారు. ఇప్పటికే శనివారం రోజు కాస్త క్లూ ఇచ్చిన లగడపాటి.. ఆదివారం సర్వే ఫలితాలు వెల్లడించారు.